లోకేశ్‌పై మాతృభాష స్పెష‌ల్ ట్రోల్స్‌

ప్ర‌తిదీ జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ముడిపెట్టి విమ‌ర్శించ‌డం చంద్ర‌బాబుతో పాటు ఎల్లో ద‌ళానికి అల‌వాటైంది. దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధ‌ర‌లు పెరిగినా జ‌గ‌నే కార‌ణ‌మ‌ని రాద్ధాంతం చేస్తుండ‌డాన్ని చూస్తున్నాం. తాజాగా తెలుగు వ్య‌వ‌హారిక భాషోద్య‌మ మూల…

ప్ర‌తిదీ జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ముడిపెట్టి విమ‌ర్శించ‌డం చంద్ర‌బాబుతో పాటు ఎల్లో ద‌ళానికి అల‌వాటైంది. దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధ‌ర‌లు పెరిగినా జ‌గ‌నే కార‌ణ‌మ‌ని రాద్ధాంతం చేస్తుండ‌డాన్ని చూస్తున్నాం. తాజాగా తెలుగు వ్య‌వ‌హారిక భాషోద్య‌మ మూల పురుషుడు గిడుగు రామ్మూర్తిని జ‌యంతిని తెలుగు భాషా దినోత్స‌వంగా జ‌రుపుకుంటున్నారు. 

ఈ సంద‌ర్భంగా ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న పుత్ర‌ర‌త్నం లోకేశ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. అంత‌టితో వారు ఆగితే నెటిజ‌న్ల‌కు ప‌ని త‌ప్పేది. తెలుగు భాషా దినోత్స‌వాన్ని అవ‌కాశంగా తీసుకుని వైసీపీ ప్ర‌భుత్వంపై చంద్ర‌బాబు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించ‌డంతో సోష‌ల్ మీడియాలో ఆయ‌న టార్గెట్ అయ్యారు.

“తెలుగు, సంస్కృతానికి తేడా తెలియని వైసీపీ పాలనలో గిడుగు ఆకాంక్షలు నీరుగారిపోతున్నాయి. బోధనా భాషగా, పాలనా భాషగా ఉన్నప్పుడు ఏ భాషకైనా మరింత రాణింపు ఉంటుంది. తెలుగు భాషకు ఆ ప్రాప్తం లేకుండా ఈ ప్రభుత్వం చేస్తోంది. తెలుగు భాషను నాశనం చేసేందుకే కంకణం కట్టుకున్నట్టుగా వ్యవహరిస్తోన్న వైసీపీ ప్రభుత్వం నుంచి అమ్మ భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వారిపైనా ఉంది” అని చంద్ర‌బాబు త‌న మార్క్ విమ‌ర్శ‌ల‌ను గుప్పించారు.

ఈ సంద‌ర్భంగా నెటిజ‌న్లు చంద్ర‌బాబుపై సెటైర్స్ విసురుతున్నారు. వివిధ సంద‌ర్భాల్లో తెలుగు భాష‌ను ఖూనీ చేసిన త‌న‌యుడి మాతృభాషా ప్రావీణ్యం గురించి చంద్ర‌బాబుకు గుర్తు చేసే వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. తెలుగుదేశం పార్టీ  అధినేత‌గా క‌నీసం త‌న కుమారుడికి తెలుగు మాట్లాడ్డం, రాయ‌డం నేర్పించ‌ని చంద్ర‌బాబు కూడా …జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిం చడమేనా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

ముందు కుమారుడు లోకేశ్ నుంచి మాతృభాష తెలుగును కాపాడే ఐడియా ఏదైనా ఉంటే చెప్పు చంద్ర‌బాబు అని నెటిజ‌న్లు వెట‌క‌రిస్తుండ‌డం విశేషం. మాతృభాషైన తెలుగుకు ప్ర‌మాదం ఏదైనా పొంచి ఉందంటే… అది త‌మ‌రి పుత్ర‌ర‌త్నం నుంచే అని మ‌రికొంద‌రు నెటిజ‌న్లు సృజ‌నాత్మ‌క పోస్టులు పెట్ట‌డం ఆక‌ట్టుకుంటోంది. 

మాతృభాష‌ను ప‌రిర‌క్షించే చ‌ర్య‌లు మొట్ట‌మొద‌ట‌గా త‌మ‌రి ఇంటి నుంచే మొద‌లు పెట్టాల‌ని నెటిజ‌న్లు హిత‌వు ప‌లక‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి మాతృభాషా దినోత్స‌వం నాడు లోకేశ్‌ను నెటిజ‌న్లు ట్రోల్ చేస్తూ  బాబుకు హిత‌వ‌చ‌నాలు చెప్ప‌డం ఈ రోజు ప్ర‌త్యేకం.