టీడీపీ యువనేత, ట్విటర్ ముద్దుబిడ్డ నారా లోకేశ్‌కు సోషల్ మీడియాలోనే 24 గంటలూ గడుపుతుండటం వల్ల ఏపీలో ఏం జరుగుతున్నదో అర్థం కానట్టుంది. ఆయన పేరు మీద ఎవరో ఒకరు ఏదో ఒకటి ట్వీట్ చేస్తూ…మా నాయకుడు ఎంత యాక్టీవ్‌గా ఉన్నాడో చూడండి అని లోకాన్ని మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారు.
ఆదివారం ఆయన ఓ ట్వీట్ చేశాడు. సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశాడు.
‘‘సిగ్గు అనేది పూర్తిగా వదిలేశారా జగన్ మోహన్‌రెడ్డి? ప్రభుత్వ ప్రకటనల్లో తప్పుడు ప్రచారం చేయడానికి సిగ్గు అనిపించడంలేదా? దొంగ పత్రిక సాక్షిలో గత ప్రభుత్వం రూ. వెయ్యి పెన్షన్ ఇచ్చిందని వేస్తారా?, మీ నాయన పెన్షన్ కేవలం రూ. 200 ఇస్తే..మా నాయన 10 రెట్లు పెంచి రూ. 2వేలు ఇచ్చారు. మీరు రూ. 3 వేలు పెన్షన్ ఇస్తామని మోసం చేశారు. ప్రజల సొమ్ముతో అబద్ధపు డబ్బా కొట్టుకుంటారా?’’ అంటూ లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శించాడు.
జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తిగా హామీల అమలుపైనే దృష్టి పెట్టాడు. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నాడు. ప్రతి నెలా ఒక్కో హామీని నెరవేరుస్తున్నాడు. పింఛన్‌ను 3 వేలకు పెంచుతూ పోతానని ఇచ్చిన హామీని…సీఎంగా బాధ్యతలు చేపట్టిన వేదికపై నుంచే అమలుకు శ్రీకారం చుట్టాడు. మొట్ట మొదటి ఏడాదే రూ.250 పెంచుతూ ఫైల్‌పై సంతకం చేశాడు. అంతేకాదు, గత నెల నుంచి నేరుగా ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ సొమ్మును లబ్ధిదారులకు అందజేస్తున్నారు.
ఇదే చంద్రబాబు విషయానికి వస్తే…ఇంకో ఆరేడు నెలల్లో మళ్లీ సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయని మొక్కుబడిగా హామీల అమలుకు శ్రీకారం చుట్టిన విషయం జగద్వితం. అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. కేవలం 23 అసెంబ్లీ సీట్లు మాత్రమే కట్టబెట్టారు. స్వయంగా తాను మంగళగిరిలో ఓడిపోయాననే కనీస స్పృహ, సిగ్గు లేకుండా…సిగ్గు అనేది పూర్తిగా వదిలేశారా జగన్మోహన్రెడ్డి అని ట్విటర్ వేదికగా లోకేశ్ ప్రశ్నించాడు.
ఇంతకంటే సిగ్గుమాలిన తనం ఏమైనా ఉందా? హామీలను అమలు చేస్తున్నందుకు జగన్ సిగ్గుపడాలా? ఏంటీ సిగ్గుమాలిన ట్వీట్? కనీసం జనం నవ్వుకుంటారనే ఇంగితం కూడా లోకేశ్‌కు లేదా? ఏదో ఒకటి విమర్శ చేయాలనే ఉత్సాహం తప్పితే…అందులో విచక్షణ కనిపించడం లేదు.
బయట వాళ్ళు చూసి పిచ్చోడు వీడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లండి అనేవాళ్లు