అన్‌స్టాపబుల్ కామెడీ…టీడీపీ యువ‌కిషోరం!

అది టీడీపీ 41వ వ‌సంతం వేడుక‌. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యం. సాయంత్రం వేళ‌. అప్పుడ‌ప్పుడే సూర్య‌భ‌గ‌వానుడు పొద్దువాలుతున్నాడు. మ‌రో వైపు నుంచి చ‌ల్ల‌నిగాలి. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ఓ వ్య‌క్తి వేదిక‌పైకి వ‌చ్చారు.…

అది టీడీపీ 41వ వ‌సంతం వేడుక‌. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యం. సాయంత్రం వేళ‌. అప్పుడ‌ప్పుడే సూర్య‌భ‌గ‌వానుడు పొద్దువాలుతున్నాడు. మ‌రో వైపు నుంచి చ‌ల్ల‌నిగాలి. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ఓ వ్య‌క్తి వేదిక‌పైకి వ‌చ్చారు. అప్పుడు మొద‌లైన కామెడీ… ఆయ‌న నోటే అన్‌స్టాప‌బుల్ అంటూ త‌న మామ చేస్తున్న ఓటీటీ షోకు సంబంధించిన‌ డైలాగ్‌తో ఇర‌గ‌దీశారాయ‌న‌. 

ఆ యువ న‌టుడెవ‌రూ తెలుసుకునే ముందు, ఆయ‌న పండించిన హాస్యం ఏంటో చూద్దాం. ఏ కామెడీ షోకి త‌గ్గ‌కుండా ఆద్యంతం హాస్య‌భ‌రితంగా సాగిన ఆ షోలో ఆయ‌న ఏమ‌న్నారంటే….

‘టీడీపీ కుటుంబ సభ్యులను వేధించి ఇబ్బంది పెడుతున్న అధికారులు, వైసీపీ నాయకులకు త్వరలోనే సినిమా మొదలవు తుంది. వారి పాపాలను చూస్తూ ఊరుకోను. గుర్తుపెట్టుకుని వెంటాడతా. వారు అమెరికాలో ఉన్నా, ఐవరీ కోస్ట్‌లో ఉన్నా వదిలిపెట్టేది లేదు’

‘ఎన్టీఆర్‌, చంద్రబాబు దేవుళ్లు.. రాముడు వంటివారైతే నేను మూర్ఖుడిని. వైసీపీ ఎమ్మెల్యేల మాటలతో నా తల్లి ఎంత బాధపడిందో నాకు తెలుసు. హత్యాయత్నం సహా నాపై 11 కేసులు పెట్టారు. భయపడను. పోరాటం ఆపను. టీడీపీ కార్యకర్తలెవరూ కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. ఒక కార్యకర్త జోలికి వస్తే మొత్తం గ్రామమే తరలివస్తుంది. ఒక నాయకుడి జోలికి వస్తే మొత్తం రాష్ట్ర పార్టీ అంతా వస్తుంది’

‘పోరాటం చేసి కేసులు పెట్టించుకున్న కార్యకర్తలే నాకు ఆప్తులు. నా కంటే ఒక కేసు ఎక్కువ ఉన్న కార్యకర్తలకే రేపు నేను పలుకుతాను. గతంలో కేసులు ఉంటే చంద్రబాబు ఏమైనా అంటారేమోనని భయపడేవారు. కాలం మారింది. ముల్లును ముల్లుతోనే తీయాల్సిన రోజులివి. దేనికీ వెనకాడవద్దు. టీడీపీ అన్‌స్టాపబుల్‌. ఎవరూ ఆపలేరు’ అని ఆయన తెగ న‌వ్వించేశారు. 

ఇంత‌కూ ఆయ‌నెవ‌రో ప్ర‌త్యేకంగా చెప్పాలంటారా? టీడీపీ యువ‌కిషోరం, భ‌విష్య‌త్‌ వార‌సుడు. రాముడిలాంటి ఎన్టీఆర్‌ను చంపిన వారు రాక్ష‌సుడవుతారా? రాముడ‌వుతారా? ఇలాంటివి వింటే కామెడీ కాక మరేమంటారు? ఇంత‌కూ ఈ మూడేళ్ల‌లో టీడీపీ యువ‌కిషోరం చేసిన పోరాటాలెన్ని? ట్విట‌ర్‌, మీడియా త‌ప్ప‌, మ‌రెక్క‌డైనా ఈ ఉత్త‌ర కుమారుడు క‌నిపించిన దాఖ‌లాలు ఉన్నాయా? తెలుగు త‌మ్ముళ్లు వింటున్నార‌ని, ప్ర‌గల్భాలు ప‌ల‌క‌డం ….క‌నీసం ఎమ్మెల్యేగా గెల‌వలేని నాయ‌కుడే కాని ఈ నాయ‌కుడికే చెల్లింది.