లోకేష్ – ఊరమాస్ ట్వీట్ లు

నాయకుడు అన్నవాడికి వయసుతో సంబంధం వుండదు. లీడర్ షిప్ క్వాలిటీలు, హోదాకు తగిన బిహేవియర్ ఆటోమెటిక్ గా అలవర్చుకోవాలి. అది అత్యవసరం. సంయమనం కోల్పోయి, మరీ చీప్ గా మాట్లాడకూడదు. రెచ్చగొట్టినా రెచ్చి పోకూడదు. …

నాయకుడు అన్నవాడికి వయసుతో సంబంధం వుండదు. లీడర్ షిప్ క్వాలిటీలు, హోదాకు తగిన బిహేవియర్ ఆటోమెటిక్ గా అలవర్చుకోవాలి. అది అత్యవసరం. సంయమనం కోల్పోయి, మరీ చీప్ గా మాట్లాడకూడదు. రెచ్చగొట్టినా రెచ్చి పోకూడదు. 

చంద్రబాబు, జగన్ ఆ విషయంలో మార్కులు కొట్టేస్తారు. విజయసాయిరెడ్డి లాంటి వారు ఒక్కోసారి తమ స్థాయికి తగని ట్వీట్ లు వేస్తుంటారు. అయితే విజయసాయి సంగతి ఎలా వున్నా లోకేష్ లాంటి వాళ్లు అలా చేయకూడదు. ఎందుకంటే తెలుగుదేశం వారసత్వ పగ్గాలు లోకేష్ చేతిలో వున్నాయి.

ఆ పార్టీ నాయకుడిగా చాలా హుందాగా వుండాలి. లేదా హుందాగా వుండడానికి ప్రయత్నించారు. కనీసం హుందాగా వున్నట్లు నటించాలి. ఎందుకు ఇప్పుడు ఇదంతా ఏకరవు పెట్టడం అంటే, ట్విట్టర్ లో లోకేష్ యాక్టివ్ గా వుంటారు. అధికారం చేజారి నుంచి ఆయన చేస్తున్న ఏకైక కార్యక్రమం ఏమిటంటే ట్వీట్లు వేయడమే. ట్వీట్లలో ఆయన ఒక్కోసారి తనను తాను మర్చిపోతుంటారు. ఓ పార్టీ వారసత్వ నేతను అని గుర్తుంచుకోరు. 

ఈ రోజు కూడా ట్విట్టర్ లో అలాగే బిహేవ్ చేసారు లోకేష్. సోషల్ మీడియాలో ఏ పార్టీ అభిమానులైనా సరే, హార్డ్ కోర్ లు కొందరు వుంటారు. వాళ్లు కాస్త రఫ్, మూర్ఘంగా బిహేవ్ చేస్తుంటారు. ఇష్టం వచ్చినట్లు భాష వాడతారు. కామెంట్లు పెడతారు. తప్పదు అన్నీ భరించాల్సిందే. 

కానీ లోకేష్ మాత్రం ఈ విషయంలో తాను ఓ పార్టీ నాయకుడిని అని మర్చిపోయి జస్ట్ ఓ మాస్ ట్విట్టర్ హ్యాండిల్ హోల్డర్ గా మారిపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే, ఎవరో లోకేష్ పేరిట ఫేక్ ఇమిటేషన్ ఐడి క్రియేట్ చేసి ఓ ట్విట్ వేసారు. ట్విట్టర్ లో ఇలాంటివి సర్వసాధారణం. ప్రతి సెలబ్రిటీ ఐడి లకు రకరకాలుగా ఫేక్ లు క్రియేట్ చేస్తుంటారు. వాటిని చూసీ చూడనట్లు వదిలేయాల్సిందే. 

అయితే లోకేష్ అలా ఊరుకోలేదు. ఓ చౌకబారు ట్వీట్ వేసారు.

''…జగన్ రెడ్డి వేసే 5 రూపాయిల ముష్టి కోసం ఎంత కన్నా దిగజరుతాయి పేటిఎం కుక్కలు. మీ నాయకుడి దగ్గర సరుకు లేదు ఇక మీ బతుకులు ఫేక్ ట్వీట్లు వేసుకొని సంబరపడటమే….'' 

అంటూ లోకేష్ ట్వీట్ వేసారు. ఈ పేటిఎమ్ బ్యాచ్, అయిదు రూపాయల పేటిఎమ్ అన్న పదాలు ట్విట్టర్లో రకరకాల హార్డ్ కోర్ బ్యాచ్ వాడుతుంటారు.లోకేష్ అక్కడితో ఆగలేదు

''…పేరాసిట్మాల్, బ్లీచింగ్తో కరోనా చచ్చిపోతుంది అన్న మీ జగరోనా మాటలు విని ప్రపంచమంతా నవ్వుకుంది. ఇప్పటికైనా ఫేక్ ట్వీట్లు మాని ప్రజల ప్రాణాలు కాపాడమని మీ జగరోనాకి గడ్డి పెట్టండి జఫ్ఫాస్…''

ఇక్కడ కూడా అలాంటి పదాలే వాడారు. ఈ జప్ఫాస్ అన్న పదం అలాంటిదే. ఈ మధ్య రఘురామరాజు ఎక్కువగా వాడుతున్నారు. బహుశా ఆయనను చూసే లోకేష్ తన స్టయిల్ మార్చుకుని ఈ ఊరమాస్ వ్యవహారానికి దిగారేమో?