పూజ..భయపడినంతా అయింది

కరోనా పాజిటివ్ వచ్చిన సెలబ్రిటీల జాబితాలో హీరోయిన్ పూజా హెగ్డేై కూడా జాయిన్ అయింది. తనకు పాజిటివ్ వచ్చిందని, ఐసోలేషన్ లోకి వెళ్తున్నానని ఆమె స్వయంగా ప్రకటించింది.  Advertisement గతం రెండు వారాలుగా పూజా…

కరోనా పాజిటివ్ వచ్చిన సెలబ్రిటీల జాబితాలో హీరోయిన్ పూజా హెగ్డేై కూడా జాయిన్ అయింది. తనకు పాజిటివ్ వచ్చిందని, ఐసోలేషన్ లోకి వెళ్తున్నానని ఆమె స్వయంగా ప్రకటించింది. 

గతం రెండు వారాలుగా పూజా చాలా జాగ్రత్తగానే వుంటోంది. అయినా తప్పలేదు. ప్రభాస్ రాథేశ్యామ్ షూటింగ్ కు రావడానికి కూడా పూజా జంకినట్లు బోగట్టా. అందుకే ఆ సినిమా షూటింగ్ కూడా నిలిపేసారని బోగట్టా.

కరోనా ఎవరినీ వదలడం లేదు. అలాగే పూజాను కూడా వదలలేదు. టాలీవుడ్ లో ప్రతి యూనిట్ లో కరోనా కేసులు వున్నాయి. ఎక్కడో ఔట్ డోర్ లో షూటింగ్ లు జరుగుతున్న ఒకటి రెండు మినహా మిగిలిన సినిమాలు అన్నీ దాదాపు ఆగిపోయాయిు. అన్నియూనిట్ లు ఆఫీసులు క్లోజ్ చేసేసాయి. 

ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏవైనా వుంటే అవి మాత్రం జూమ్ కాల్స్, మీటింగులతో కానిస్తున్నారు.