ఏకాంతంగానే అప్పన్న చందనోత్సవం

ఉత్తరాంధ్రా జిల్లాల్లో సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం శ్రీ సింహాచల వరాహ లక్ష్మీ నరసింహా స్వామి వారి కి ఏటా నిర్వహించే చందనోత్సవం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఆ రోజున స్వామి వారి నిజ రూప…

ఉత్తరాంధ్రా జిల్లాల్లో సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం శ్రీ సింహాచల వరాహ లక్ష్మీ నరసింహా స్వామి వారి కి ఏటా నిర్వహించే చందనోత్సవం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఆ రోజున స్వామి వారి నిజ రూప దర్శనంతో భక్తులను తరింపచేస్తారు. చందనోత్సవం కోసం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు.

ఒక విధంగా సింహాచలం భక్తులతో కిటకిటలాడతాయి. లక్షలాదిమంది భక్తులు తరలివస్తారని ఒక అంచనా. అలాంటి చందనోత్సవాలు ఈసారి కూడా ఏకాంతంగానే  నిర్వహించడానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నెల 14న స్వామి వారి చందనోత్సవం పరిమితమైన ఏర్పాట్లతోనే సాగుతుంది అని చెబుతున్నారు. కరోనా మహమ్మారి కోరలు చాచిన వేళ భక్తులెవ్వరికీ దర్శనాలకు అనుమతిలేదని ఆలయ వర్గాలు తెలియచేస్తున్నాయి.

గత ఏడాది కూడా ఇదే సమయంలో కరోనా ఉంది. దాంతో నాడూ ఏకాంతంగానే చందనోత్సవాలు జరిపారు. వంశపారంపర్య ధర్మక‌ర్త, వారి కుటుంబ సభ్యులు, ముఖ్యులు మాత్రమే స్వామిని సేవించుకున్నారు. మొత్తానికి వరసపెట్టి రెండవ ఏడు కూడా ఇలాగే సాగడంతో అప్పన్న భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.