విశాఖలో లుంగీ బ్యాచులట ?

లుంగీ బ్యాచులట. కడప కల్చరట. పులివెందుల ఫ్రాక్షనట. ఏంటో ఈ భాష. అన్న వాళ్ళూ చిల్లర నాయకులు కాదు, చిన్నా చితకా పదవులు చేసిన వారు అంతకంటే కాదు, ఉమ్మడి ఏపీ నుంచి మంత్రులుగా…

లుంగీ బ్యాచులట. కడప కల్చరట. పులివెందుల ఫ్రాక్షనట. ఏంటో ఈ భాష. అన్న వాళ్ళూ చిల్లర నాయకులు కాదు, చిన్నా చితకా పదవులు చేసిన వారు అంతకంటే కాదు, ఉమ్మడి ఏపీ నుంచి మంత్రులుగా ఉన్న వారు. అన్ని ప్రాంతాలు సమానంగా చూసుకుంటామని ప్రమాణం చేసి ఏలిన దొరలు. మరి అటువంటి వారి నోటి వెంట ఒక ప్రాంతాన్ని కించపరచే కామెంట్స్ రావడం దారుణమే.

విశాఖలో లుంగీ బ్యాచులు దిగిపోయాయట. ఈ ప్రాంత ప్రజలు భయాందోళనలో ఉన్నారట. ఇదీ ఘనత వహించిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కామెంట్స్. విశాఖను లుంగీ బ్యాచులు పాడుచేస్తున్నాయట. జనమంతా వణికిపోతున్నారుట.

అంతేనా కడప కల్చర్ స్మార్ట్ సిటీలోకి ఎంటరైందట. అభివ్రుద్ధి అన్నది ఎక్కడా లేకుండా  సర్వనాశనం చేస్తున్నారుట. మొత్తానికి అయ్యన్న లాంటి పెద్దలు ఇలా మాట్లాడడమే దారుణమని కామెంట్స్ వస్తున్నాయి. మంత్రిగా పనిచేసిన అయ్యన్నకు కడప అంటే పరాయి దేశంగా కనిపిస్తోందా అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

ఇక లుంగీ బ్యాచులంటూ మరో గడ్డ  కల్చర్ ని కించపరచే హక్కు ఎవరు ఇచ్చారని గద్దిస్తున్నారు. మొత్తానికి ఎవరు ఏమనుకుంటే నాకేంటి అన్న తరహాలో అయ్యన్న సహా తమ్ముళ్ళు ఆరేళ్ళుగా విశాఖలో కడప కల్చర్  అంటూ రెచ్చగొడుతూనే ఉన్నారు. విశాఖ కడపల మధ్య గొడవలు పెడుతూనే ఉన్నారు. 

బాధపడుతున్న వంశీ పైడిపల్లి

నాలుగేళ్ల తర్వాత హిట్‌ వచ్చింది