మూడు ముళ్ల బంధానికి అడ్డంకిగా మ‌హ‌మ్మారి!

క‌రోనా మ‌హ‌మ్మారి సెకెండ్ వేవ్ భ‌య‌పెడుతోంది. మూడు ముళ్ల వివాహ బంధానికి క‌రోనా ముంద‌రి కాళ్ల బంధంలా అడ్డు ప‌డుతోంది. పెళ్లికి హాజ‌రు కావాలంటే క‌రోనా టెస్ట్ త‌ప్ప‌ని స‌రి అని అంటుండంతో …ఇదెక్క‌డి…

క‌రోనా మ‌హ‌మ్మారి సెకెండ్ వేవ్ భ‌య‌పెడుతోంది. మూడు ముళ్ల వివాహ బంధానికి క‌రోనా ముంద‌రి కాళ్ల బంధంలా అడ్డు ప‌డుతోంది. పెళ్లికి హాజ‌రు కావాలంటే క‌రోనా టెస్ట్ త‌ప్ప‌ని స‌రి అని అంటుండంతో …ఇదెక్క‌డి కండీష‌న్ అని పెళ్లిళ్లు చేసుకునే వాళ్లు వాపోతున్నారు. అయితే మ‌హ‌మ్మారి మ‌రోసారి పంజా విసురుతున్న స‌మ‌యంలో అట్ట‌హాసంగా వివాహాలు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌నే ప్ర‌శ్న కూడా పెద్ద ఎత్తున తెర‌పైకి వ‌స్తోంది.

ముఖ్యంగా క‌రోనా విస్త‌రిస్తున్న మ‌హారాష్ట్ర‌, కేర‌ళతో పాటు క‌ర్నాట‌క‌లో పెళ్లి నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు. కేర‌ళ నుంచి వ‌చ్చేవారు త‌ప్ప‌ని స‌రిగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవ‌డంతో పాటు నెగిటివ్ వ‌స్తేనే… అనుమ‌తిస్తారు. ఈ నిబంధ‌న‌లు పెళ్లిళ్ల‌కు సంబంధించిన వారికి తీవ్ర ఆవేద‌న‌కు గురి చేస్తున్నారు.

తాజాగా  సుమ‌తి, ప్ర‌మోద్‌నాయ‌ర్ వివాహం నేడు జ‌ర‌గాల్సి వుండింది. అయితే క‌రోనా నిబంధ‌న‌లు పెళ్లికి ఎస‌రు తెచ్చాయి.  క‌ర్నాట‌క‌లోని కొడగు జిల్లా మడికేరిలోని కడగదాళు గ్రామానికి చెందిన సుమతి అనే అమ్మాయికి కేరళలోని కాసరగోడు జిల్లాకు చెందిన ప్రమోద్‌ నాయర్‌తో వివాహం కుదిర్చారు. మడికెరిలోని ఓంకారేశ్వర దేవాలయంలో పెళ్లి నేడు జరగాల్సి ఉంది.

ఇదిలా ఉండ‌గా  పెళ్లికొడుకు త‌ర‌పు వారు కరోనా నెగిటివ్‌ రిపోర్టు తీసుకురావాల‌నే నిబంధ‌న ఉండ‌డంతో పెద్ద చిక్కు వ‌చ్చి ప‌డింది. వంద‌లాది మందికి త‌క్కువ స‌మ‌యంలో  కరోనా పరీక్షలు జరిపించాలంటే సాధ్యం కాద‌ని వ‌రుడు త‌ర‌పు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో సోమవారం వివాహం నాటికి కరోనా పరీక్షల ఫలితాలు రావడం ఆలస్యమవుతుం దని చెబుతున్నారు. ఒక‌వేళ‌ కుటుంబ సభ్యులు మాత్ర‌మే హాజ‌రు కావాల‌న్నా క‌నీసం  10–15 మందికి ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో  ప‌రీక్ష‌లు చేయించుకున్నా రూ. 25 వేలైనా ఖర్చు అవుతుందని వాపోతున్నారు. 

కానీ క‌రోనా టెస్ట్‌ల విష‌యానికి వ‌స్తే ఖ‌ర్చుల‌ని సాకులు చెబుతార‌ని, అలాంట‌ప్పుడు సింపుల్‌గా పెళ్లి చేసుకుంటే స‌రిపోతుంది క‌దా అని ప్ర‌శ్నించే వాళ్లు లేక‌పోలేదు. మొత్తానికి నిబంధ‌న‌లు మాత్రం చుక్కలు చూపుతున్నాయ‌ని చెప్పొచ్చు. 

నిస్సహాయ స్థితిలో ఎపి భారతీయ జనతా పార్టీ

పవన్ కళ్యాణ్ మానసిక రోగి