వైసీపీలో గుబులు రేపుతున్న నిమ్మ‌గ‌డ్డ ప్ర‌క‌ట‌న‌

ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ వ్య‌వ‌హారం ఏంటో ఏపీ రాజ‌కీయ పార్టీల‌కు ఏమీ అర్థం కావ‌డం లేదు.  ఆయ‌న ఎవ‌రికి అనుకూల‌మో, ఎవ‌రికి వ్య‌తిరేక‌మో అర్థం కాక‌, త‌ల బ‌ద్ధ‌లు కొట్టుకుంటున్న ప‌రిస్థితి. పుర‌పాల‌క ఎన్నిక‌ల‌ను…

ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ వ్య‌వ‌హారం ఏంటో ఏపీ రాజ‌కీయ పార్టీల‌కు ఏమీ అర్థం కావ‌డం లేదు.  ఆయ‌న ఎవ‌రికి అనుకూల‌మో, ఎవ‌రికి వ్య‌తిరేక‌మో అర్థం కాక‌, త‌ల బ‌ద్ధ‌లు కొట్టుకుంటున్న ప‌రిస్థితి. పుర‌పాల‌క ఎన్నిక‌ల‌ను ఆగిన చోటు నుంచే మొద‌లు పెడ‌తామ‌ని నిమ్మ‌గ‌డ్డ ప్ర‌క‌టించ‌డంతో అధికార పార్టీ ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష పార్టీలు విమ‌ర్శ‌లకు దిగాయి.

అంతేకాదు, మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు రీనోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని జ‌న‌సేన‌తో పాటు మ‌రికొంద‌రు హైకోర్టును ఆశ్ర‌యించారు. రాష్ట్ర అత్యున్న‌త న్యాయ‌స్థానం విచారించి ఎస్ఈసీ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థిస్తూ, రీనోటిఫికేష‌న్ కోరుతూ దాఖ‌లైన 16 పిటిషిన్ల‌ను కొట్టి వేసింది. దీంతో ఎస్ఈసీతో పాటు అధికార పార్టీ ఊపిరి పీల్చుకుంది.

ఈ నేప‌థ్యంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌పై రీజ‌న్ల వారీగా స‌మీక్ష స‌మావేశాల‌ను ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయ‌న బాంబు పేల్చారు.

“బలవంతపు చర్యలతో మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్న, ప్రత్యేక పరిస్థితుల్లో నామినేషన్లు వేయలేకపోయిన వారికి మరో అవకాశం కల్పించే విషయాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. బాధితుల అభ్యర్థనలపై ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. ఇలాంటి వారిపట్ల సానుభూతితో వ్యవహరించి సంశయ లాభం (బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌) కింద మరోసారి అవకాశం కల్పించాలని భావిస్తున్నాం” అని  ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ప్ర‌క‌టించారు.

ఈ విషయంలో ఎన్నికల సంఘానికి ఉన్న విశేషాధికారాలను మొదటిసారి వినియోగించబోతున్నామని ఆయ‌న తేల్చి చెప్పారు.  అయితే వీటికి సంబంధించి  కలెక్టర్ల నుంచి పూర్తిస్థాయిలో  నివేదికలు రాగానే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.   

హైకోర్టు తీర్పుతో ఏక‌గ్రీవం చేసుకున్న అభ్య‌ర్థులు ఖుషీగా ఉన్నారు. అయితే ఎస్ఈసీ తాజాగా పిడుగులాంటి ప్ర‌క‌ట‌న‌తో అభ్య‌ర్థుల్లో భ‌యం ప‌ట్టుకుంది. చాలాచోట్ల ప్ర‌త్య‌ర్థుల‌కు పెద్ద ఎత్తున డ‌బ్బు ముట్ట‌చెప్పి ఏక‌గ్రీవం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఒక‌వేళ మ‌రోసారి నామినేష‌న్ వేసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తే త‌మ ప‌రిస్థితి ఏంట‌ని ఏక‌గ్రీవమైన అభ్య‌ర్థులు వాపోతున్నారు. 

నిస్సహాయ స్థితిలో ఎపి భారతీయ జనతా పార్టీ

పవన్ కళ్యాణ్ మానసిక రోగి