ఆన్‌లైన్ క్లాస్‌ల‌పై హైకోర్టు సంచ‌ల‌న కామెంట్స్‌

క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో విద్యా సంస్థ‌లు తెర‌వ‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వెనుకాడుతున్నాయి. దీంతో కేంద్రీయ విద్యాల‌య సంస్థ‌ల‌తో పాటు కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థ‌లు విద్యా సంవ‌త్స‌రం వృథా కాకుండా ఆన్‌లైన్…

క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో విద్యా సంస్థ‌లు తెర‌వ‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వెనుకాడుతున్నాయి. దీంతో కేంద్రీయ విద్యాల‌య సంస్థ‌ల‌తో పాటు కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థ‌లు విద్యా సంవ‌త్స‌రం వృథా కాకుండా ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వ‌హిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆన్‌లైన్ క్లాస్‌ల నిర్వ‌హ‌ణ‌కు ఎక్కువ మొత్తం ఖ‌ర్చు అవుతుండ‌డంతో విద్యార్థుల త‌ల్లిదండ్రులు గ‌గ్గోలు పెడుతున్నారు.

మ‌రో వైపు ఎల్‌కేజీ నుంచి ఆన్‌లైన్ క్లాస్‌లు ఏంటంటూ ప్ర‌జాసంఘాల నాయ‌కులు, విద్యా వేత్త‌లు ప్ర‌శ్నిస్తున్నారు. తెలంగాణ‌లో ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ‌పై పెత్త ఎత్తున చ‌ర్చ, ర‌చ్చ‌ జ‌రుగుతోంది. కొంద‌రు హైకోర్టులో పిటిష‌న్ కూడా దాఖ‌లు చేశారు. త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ‌పై నివేదిక స‌మ‌ర్పించాల‌ని హైకోర్టు ఆదేశించింది.

ఈ నేప‌థ్యంలో ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ‌పై బాంబే హైకోర్టు సంచ‌ల‌న కామెంట్స్ చేసింది.  బాంబే హైకోర్టు కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఆన్‌లైన్ క్లాసులు వ్య‌తిరేకించ‌డాన్ని జాతి ప్ర‌యోజ‌నాల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే అని ఘాటైన వ్యాఖ్య‌లు చేసింది.

ఆన్‌లైన్ క్లాసులనేవి గొప్ప ప్ర‌గ‌తిశీల చ‌ర్య‌గా అభిప్రాయ‌ప‌డింది. మనం 21వ శతాబ్దంలో ఉన్నామని.. ప్రపంచం డిజిటల్‌ యుగంలో కొనసాగుతోందని బాంబే హైకోర్టు గుర్తు చేసింది. డిజిటల్‌, వర్చువల్‌ లెర్నింగ్‌ను అందరూ ప్రోత్సహించాలని కోర్టు కోరింది. దీనిని అడ్డుకోవం అంటే ప్రాథమిక విద్యాహక్కును కాలరాయడమేనని బాంబే హైకోర్టు తేల్చి చెప్పింది.

ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణలో ఇబ్బందులు ఉంటే వాటిని సరి చేయాలని సూచించింది.  ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణలో లోపా లను సరిదిద్దాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హిస్తున్న‌, నిర్వ‌హించాల‌ని భావిస్తున్న వారికి బాంబే హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు కొండంత బ‌లాన్ని ఇచ్చిన‌ట్టైంది.

బాంబే హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌ల‌ను తెర‌పైకి తెచ్చి…క్లాసుల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌భుత్వాల‌పై ప్రైవేట్‌, కార్పొరేట్ విద్యాసంస్థ‌లు ఒత్తిడి తెచ్చే అవ‌కాశం లేక‌పోలేదు. ఏది ఏమైనా మ‌హారాష్ట్ర హైకోర్టు చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి. 

చంద్రబాబు ఆకాశం మీద ఉమ్మేస్తున్నాడు