మజిలి సినిమాతో మాంచి మెచ్యూర్డ్ లవ్ స్టోరీ టచ్ చూపించిన నాగ చైతన్య మళ్లీ మరోసారి అలాంటి సబ్జెక్ట్ ను డీల్ చేయబోతున్నాడు. మజిలీ లాంటి సక్సెస్ ఫుల్ సినిమాను నిర్మించిన సాహు గారపాటి నే ఈ సినిమాను కూడా నిర్మించబోతున్నారు. సమ్మోహనం లాంటి రొమాటింక్ లవ్ స్టోరీని అందించిన ఇంద్రగంటి మోహన కృష్ణ ఈ సినిమాకు రూపకర్త. వి సినిమా తరువాత ఇంద్రగంటి అందిచబోయే సినిమా ఇదే.
ఈ సినిమాలో పెళ్లి అయిన జంట నడుమ నెలకొనే భావోద్వేగాలు, ప్రేమాభిమానులు, అపార్థాలు, ఇలా అన్నీ కలిసిన కథ నడుస్తుంది అని తెలుస్తోంది. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు వుంటారు. ప్రస్తుతానికి ఇంకా ఈ సినిమా ప్రీ పొడక్షన్ పనులు ఏవీ ప్రారంభం కాలేదు. స్క్రిప్ట్ వర్క్ మాత్రం జరుగుతోంది.
వి సినిమా విడుదల అయిపోయి, కరోనా కల్లోలం నుంచి ఇండస్ట్రీ బయటపడితే ఇంద్రగంటి ఈ సినిమా మీదకు వస్తారు. అయితే చైతూ లైన్ లో వేరే సినిమాలు కూడా వున్నాయి. విక్రమ్ కుమార్ డైరక్షన్ లో దిల్ రాజుకు ఓ సినిమా చేయాల్సి వుంది. ఇది కాక మరో ఒకటి రెండు సినిమాల కథలు కూడా చైతూ వింటున్నాడు.