మ‌మ‌త ఆరోగ్యంపై ఆందోళ‌న

ప‌శ్చిమ‌బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. రోజురోజుకూ ఒక‌రికి మించి మ‌రొక‌రు స‌రికొత్త డ్రామాల‌కు తెర‌లేపుతున్నారు. తాజాగా మ‌మ‌తాబెన‌ర్జీ ఆరోగ్యంపై వైద్యుల స‌ల‌హాలు, సూచ‌న‌లు టీఎంసీ శ్రేణుల్ని, ఆమె అభిమానుల్ని ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి.…

ప‌శ్చిమ‌బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. రోజురోజుకూ ఒక‌రికి మించి మ‌రొక‌రు స‌రికొత్త డ్రామాల‌కు తెర‌లేపుతున్నారు. తాజాగా మ‌మ‌తాబెన‌ర్జీ ఆరోగ్యంపై వైద్యుల స‌ల‌హాలు, సూచ‌న‌లు టీఎంసీ శ్రేణుల్ని, ఆమె అభిమానుల్ని ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో విస్తృతంగా ప‌ర్య‌టించాల్సిన స‌మ‌యంలో ఆస్ప‌త్రిపాలు కావ‌డంపై ఆందోళ‌న నెల‌కుంది.

మ‌మ‌తాబెన‌ర్జీ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ కాసేప‌టి క్రితం విడుద‌లైంది. ఛాతినొప్పితో పాటు శ్వాస తీసుకోవ‌డంలో మ‌మ‌త తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్టు వైద్యులు వెల్ల‌డించారు.  మ‌మ‌త ఎడమకాలుతో పాటు కుడిభుజం, మెడకు తీవ్ర గాయాలయ్యాయని, మరో 48 గంటలపాటు  వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నట్లు పేర్కొన్నారు.  మమతకు మరో రెండు నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

నందిగ్రామ్‌లో నామినేషన్ వేసేందుకు వెళ్లిన  మమతా బెనర్జీపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. నామినేషన్‌ వేసిన అనంతరం తిరిగి వెళుతుండ‌గా దాడి చేశారని, తనను నెట్టివేయడంతో ఎడమ కాలికి గాయమైందని మమత  ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. దాడి జరిగిన సమయంలో  ఒక్క పోలీసు కూడా లేడని, తనపై కుట్ర జరగుతోందని ఆమె సంచ‌న‌ల ఆరోప‌ణ‌లు చేశారు.

ఇదిలా ఉండ‌గా మమతా బెనర్జీపై దాడిని కేంద్ర ఎన్నిక‌ల సంఘం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేప‌థ్యంలో  రేపటిలోగా  సమగ్ర నివేదిక ఇవ్వాలని బెంగాల్ డీజీపీని ఈసీ ఆదేశించింది. ఇదిలా ఉండ‌గా అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ నేత‌ను రెండు నెల‌లు విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు చెప్ప‌డంతో టీఎంసీ శ్రేణులు ఆందోళ‌న చెందుతున్నాయి. త‌మ నేత ప్ర‌చారానికి తిర‌గ‌కుండా బీజేపీ శ్రేణులు దాడికి తెగ‌బ‌డ్డాయ‌ని టీఎంసీ వైపు నుంచి ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.  

సీరియస్ కామెడీ అంటే ఇలా చెయ్యాలి

మద్రాసులో పుట్టగొడుగులు పండించి మొత్తం నష్టపోయా..