ప్రస్తుతం దేశం అంతటా లాక్ డౌన్ నడుస్తోంది. ఏప్రియల్ 15 వరకు ఇదే వుంటుంది అని ఇప్పటికే అర్థం అయిపోయింది. కానీ మరో రెండు రోజుల్లో మరిన్ని కఠిన నిర్ణయాలు వెలువడే అవకాశం వుందని వినిపిస్తోంది. మార్చి 31 తరువాత జనాలకు ప్రస్తుతం వున్న వెసులుబాటు వేళలు తగ్గిపోతాయని, టాక్ జనాల్లో వినిపిస్తోంది.
ఇక నేరుగా ఇళ్లకే సరుకులు అందించే ఏర్పాటు చేసి, అస్సలు జనాలను వీధుల్లోకి రాకుండా చేసేలో అధికారంలో వున్నవారి ఆలోచనలు సాగుతున్నాయని బోగట్టా. వెసులుబాటు వుండడం వల్లనే వీధుల్లోకి వస్తున్నారని, అలా కాకుండా ఇళ్లకే పూర్తిగా పరిమితం చేసి, సరుకులు ఇళ్లకే పంపిస్తే బెటర్ అని అధికారుల ఆలోచనలు చేస్తున్నారట.
సడలింపు వేళలు ఇవ్వడం వల్ల సరుకులు అందేవారికి అందుతున్నాయి. లేని వారికి లేదు. అలా కాకుండా ఫోన్ ద్వారా సమాచారం తీసుకుని, అవసరమైన వారికి ఇళ్లకే అందిస్తే వేరుగా వుంటుందని అంటున్నారు. అంతే కాక, జనాలు బయటకు రావడం వల్ల లేని పోని సమస్యలు వస్తున్నాయని, అందువల్ల పూర్తిగా ఇళ్లకే పరిమితం చేస్తే, చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
ఇదిలా వుంటే ఏప్రియల్ 15తో ఈ లాకిన్ పిరియడ్ ఆగదని, పొడిగించే అవకాశాలే ఎక్కువని సోషల్ మీడియాలో గ్యాసిప్ లు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా వుంటే లిమిటెడ్ అవర్స్ లోనే లిక్కర్ షాపులు కూడా తీస్తారని,అది కూడా ఒకటి రెండు రోజులకు మాత్రమే అనుమతి వుంటుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియా లో వినిపిస్తున్న ఈవార్లల్లో ఏవి నిజమో తెలియాలంటే రెండు రోజులు ఆగాలి.