డెడ్ చీప్: రూ.162 కోట్లకే మైకేల్ జాక్సన్ రాంచ్

పాప్ దిగ్గజం మైకేల్ జాక్సన్ మరణించిన తర్వాత, అతడికి చెందిన ఆస్తులు ఒక్కొక్కటిగా అమ్ముడుపోతున్నాయి. లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు హాట్ కేకుల్లా అమ్ముడుపోగా.. అతడికి చెందిన ఓ రాంచ్ (పొలం లేదా…

పాప్ దిగ్గజం మైకేల్ జాక్సన్ మరణించిన తర్వాత, అతడికి చెందిన ఆస్తులు ఒక్కొక్కటిగా అమ్ముడుపోతున్నాయి. లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు హాట్ కేకుల్లా అమ్ముడుపోగా.. అతడికి చెందిన ఓ రాంచ్ (పొలం లేదా పచ్చిక బయళ్లు) మాత్రం చాన్నాళ్లుగా అమ్ముడుపోలేదు. ఎట్టకేలకు ఆ రాంచ్ ను అమెరికాకు చెందిన ఓ బిలియనీర్ 162 కోట్ల రూపాయలకు దక్కించుకున్నాడు.

మైకేల్ జాక్సన్ ఆస్తులకు సంబంధించి ఈ డీల్ ను అత్యంత చౌకైన డీల్ గా చెబుతారు. ఎందుకంటే, ఈ రాంచ్ ను 2016లో అమ్మకానికి పెట్టారు. అప్పుడు దీని ధర అక్షరాలా 736 కోట్ల రూపాయలు. అయితే చాన్నాళ్లుగా అమ్ముడుపోకపోవడంతో, గతేడాది దీని ధర అమాంతం పడిపోయింది. అలా 736 కోట్ల రూపాయల రాంచ్ ను కేవలం 162 కోట్ల రూపాయలకు దక్కించుకున్నాడు బిలియనీర్ రోనాల్డ్ బర్కిల్.

ఇక ఈ రాంచ్ విశేషాలు చూస్తే.. మైకేల్ జాక్సన్ దీన్ని 1988లో కొనుగోలు చేశాడు. వీకెండ్స్ లో తన విహార యాత్రల కోసం ఈ 2700 ఎకరాల రాంచ్ ను ఉపయోగించుకునేవాడు. ఇందులో మూడు రైల్-రోడ్స్ ఉన్నాయి. ఓ పెద్ద జెయింట్ వీల్ కూడా ఉంది. వీటితో పాటు విహరించడానికి ఓ ఎలక్ట్రిక్ రైలు కూడా ఏర్పాటుచేసుకున్నాడు మైకేల్. ఎన్నో రకాల పక్షులు, జంతువులతో కళకళలాడే ఈ రాంచ్ ను.. తన వ్యక్తిగత ఎమ్యూజ్ మెంట్ పార్క్ గా వాడుకున్నాడు. 

మైకేల్ జాక్సన్ మరణం తర్వాత ఇందులోని జంతువుల్ని, రైడ్స్ ను వేరే చోటుకు తరలించారు. అవి మినహాయించి, మిగతా ప్రాపర్టీ మొత్తాన్నీ అమ్మకానికి పెట్టారు. కానీ లాస్ ఏంజెలెస్ కు దూరంగా లాస్ ఓలివోస్ లో మారుమూలన ఉన్న ఈ రాంచ్ ను కొనుగోలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. 

అయితే బిలియనీర్ రోనాల్డ్ కు ఈ రాంచ్ కంటే, దీనికి ఆనుకొని ఉన్న జాకా సరస్సు బాగా నచ్చింది. అందుకే వెంటనే కొనేశాడు. దీన్ని తన బిజినెస్ లో ఎక్స్ క్లూజివ్ మెంబర్స్ కు ఆతిధ్యం ఇచ్చేందుకు ఉపయోగించబోతున్నాడు.

అరియ‌నా ట్రోఫీ గెలుస్తుంద‌ని ఎదురుచూసా