బాబు బుద్ధి మారలేదు… అహంకారం తగ్గలేదు

అధికారంలో ఉన్నప్పుడు కన్నుమిన్ను కానకుండా వ్యవహరించారు. అధికార దురంకారంతో ఇష్టారీతిన వ్యవహరించారు. ఇప్పుడు అధికారం పోయింది. అయినా చంద్రబాబు బుద్ధి మారలేదు. ఆయన అహంకారం తగ్గలేదు. తాజాగా ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ ను…

అధికారంలో ఉన్నప్పుడు కన్నుమిన్ను కానకుండా వ్యవహరించారు. అధికార దురంకారంతో ఇష్టారీతిన వ్యవహరించారు. ఇప్పుడు అధికారం పోయింది. అయినా చంద్రబాబు బుద్ధి మారలేదు. ఆయన అహంకారం తగ్గలేదు. తాజాగా ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ ను “విజయ్ కుమార్ గాడు” అని సంభోదించడమే బాబు దురహంకారానికి ప్రత్యక్ష నిదర్శనం. దీనిపై వైసీపీ మంత్రులు సీరియర్ అయ్యారు. జాయింట్ గా ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రస్తుతం మున్సిపల్ శాఖ కమిషనర్ గా ఉన్న విజయ్ కుమార్ తన బాధ్యతను నిర్వర్తించారని, బోస్టన్ కమిటీ నివేదికను వివరించారని తెలిపిన మంత్రులు.. ఆ నివేదికపై చంద్రబాబు విమర్శలు చేస్తే తప్పులేదు కానీ, నివేదిక చదివిన ప్రభుత్వాధికారిపై విచక్షణ మరిచి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఈ మేరకు ఏపీ మంత్రులు నారాయణ స్వామి, సుచరిత, విశ్వరూప్, సురేష్ ఉమ్మడిగా ఓ ప్రకటన విడుదల చేశారు.

విజయ్ కుమార్ కు చంద్రబాబు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు మంత్రులు. చంద్రబాబు ఎక్కడ అడుగుపెట్టినా, ఆ ప్రాంతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీలు, మహిళలు చంద్రబాబు రాకను  అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

అధికారంలో ఉన్నప్పుడు పలు కులాల్ని చంద్రబాబు నీఛంగా చూసిన విషయం అందరికీ తెలిసిందే. “ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా తమ్ముళ్లూ” అంటూ గతంలో బహిరంగ సభలో చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గతంలో అమరావతిలో నాయీ బ్రాహ్మణులు ఆందోళన చేస్తే రోడ్డుపైకి రాకుండా చేస్తానని హెచ్చరించారు.

బీసీలు ధర్నా చేస్తే తోకలు కత్తిరిస్తానని అన్నారు. ఓ సభలో తనకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించిన మైనార్టీలను అరెస్ట్ చేసి జైళ్లో పెట్టించారు. ఇలా పదవిలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు పదవి పోయినా బాబు అహంకారం మాత్రం తగ్గలేదు. అదో నోటి దురుసు, అదే కులపిచ్చి.

చంద్రబాబూ నీకు ఎవడిచ్చాడు హక్కు