బాబు ముంద‌స్తు ఆశ‌ల‌పై నీళ్లు!

మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ముంద‌స్తు ఎన్నిక‌ల ఆశ‌ల‌పై వైసీపీ నీళ్లు చ‌ల్లింది. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి జ‌మిలి ఎన్నిక‌ల జ‌పం చేస్తూ పార్టీని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేశారు.  Advertisement ప‌దేప‌దే త్వ‌ర‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో…

మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ముంద‌స్తు ఎన్నిక‌ల ఆశ‌ల‌పై వైసీపీ నీళ్లు చ‌ల్లింది. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి జ‌మిలి ఎన్నిక‌ల జ‌పం చేస్తూ పార్టీని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేశారు. 

ప‌దేప‌దే త్వ‌ర‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు రానున్నాయ‌ని, తిరిగి తాము అధికారంలోకి రానున్నామ‌ని చంద్ర‌బాబు న‌మ్మ‌బ‌లికే ప్ర‌య‌త్నం చేశారు. ఆ క‌థ‌ల‌న్నీ జ‌నానికి అర్థ‌మై బాబు ఏం చెప్పినా న‌మ్మ‌ని ప‌రిస్థితి తెచ్చుకున్నారు.

ఇదిలా వుండ‌గా కొత్త ఏడాది ప్రారంభ రోజు చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోందని, త‌మ పార్టీ సిద్ధంగా ఉంద‌ని ప్ర‌క‌టించారు. బాబు వ్యాఖ్య‌ల‌పై వైసీపీ ఎంపీ, ఆ పార్టీ క్రియాశీల‌క నాయ‌కుడు మిథున్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అస‌లు ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ఆలోచ‌నే త‌మ ప్ర‌భుత్వానికి లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.

ఐదేళ్లూ తాము అధికారంలో ఉంటామని మిథున్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. పార్టీని కాపాడుకునేందుకే చంద్రబాబు ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు. దీంతో ముంద‌స్తు పేరుతో రెండేళ్లు కాలం నెట్టుకు రావ‌చ్చ‌ని భావించిన చంద్ర‌బాబు ఆశ‌ల్ని మొగ్గ‌లోనే వైసీపీ తుంచేసింది. ఇక ఏం చెప్పి త‌న కేడ‌ర్‌ను కాపాడుకుంటుందో చూడాలి.