అరకు రానున్న ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొందరలో ఆంధ్రా ఊటీగా పేరు గడించిన అరకు రానున్నారు. ప్రధాని విశాఖ పర్యటనకు వచ్చి అపుడే మూడేళ్ళు పై దాటుతోంది. 2019 మొదట్లో ప్రధాని విశాఖ టూర్ చేశారు. నాడే…

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొందరలో ఆంధ్రా ఊటీగా పేరు గడించిన అరకు రానున్నారు. ప్రధాని విశాఖ పర్యటనకు వచ్చి అపుడే మూడేళ్ళు పై దాటుతోంది. 2019 మొదట్లో ప్రధాని విశాఖ టూర్ చేశారు. నాడే విశాఖ రైల్వే జోన్ గురించి కూడా కీలకమైన ప్రకటన చేశారు.

మరి ఇంతకాలానికి ప్రధాని విశాఖ జిల్లా టూర్ కు అందునా అరకు పర్యటనకు రావడం వెనక విశేషం ఏముంది అంటే ఉంది. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో అరకు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న స్మారక మ్యూజియం ని ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభింపచేయాలని చూస్తున్నారు.

కేంద్ర పర్యాటక శాఖ నిధులతో ఈ మ్యూజియం తయారవుతోంది. దాంతో మోడీ చేతుల మీదుగా మ్యూజియం ప్రారంభించడం ద్వారా అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.

ఇక కేంద్రంలో పర్యాటక మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కూడా ఏపీలో బీజేపీ ఎదుగుదలను కోరుకుంటున్నారు. దాంతో ప్రధాని మోడీని తమ శాఖ కార్యక్రమానికి రప్పించడానికి చూస్తున్నారు. మొత్తానికి చూస్తే అల్లూరి పేరుతో దేశభక్తితో పాటు అభివృద్ధిని కూడా కలగలిపి రానున్న రోజుల్లో మోడీ ద్వారా బీజేపీ మళ్ళీ విశాఖ నుంచే తన రాజకీయం దూకుడు పెంచుతుంది అన్న మాట.