మ‌’గోడు’ కూడా వినండ‌య్యా…

చ‌ట్టంలోని లొసుగుల‌ను అవ‌కాశంగా తీసుకుని మ‌గ‌వాళ్ల‌ను వేధిస్తున్నార‌ని, వారి గోడు కూడా వినాల‌నే డిమాండ్ పెరుగుతోంది. అంతేకాదండోయ్ భార్యాబాధితులంతా ఏక‌మై ఒక సంస్థ‌గా ఏర్పాటై న్యాయం కోసం నిన‌దిస్తున్నారు. భార్యా బాధితులంద‌రినీ ఏకం చేసేందుకు…

చ‌ట్టంలోని లొసుగుల‌ను అవ‌కాశంగా తీసుకుని మ‌గ‌వాళ్ల‌ను వేధిస్తున్నార‌ని, వారి గోడు కూడా వినాల‌నే డిమాండ్ పెరుగుతోంది. అంతేకాదండోయ్ భార్యాబాధితులంతా ఏక‌మై ఒక సంస్థ‌గా ఏర్పాటై న్యాయం కోసం నిన‌దిస్తున్నారు. భార్యా బాధితులంద‌రినీ ఏకం చేసేందుకు కొన్ని టోల్‌ఫ్రీ నంబ‌ర్ల‌ను సైతం ఏర్పాటు చేసుకొని, వాటికి ఫోన్లు చేసి త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకోవాల‌ని స‌ద‌రు సంస్థ నిర్వాహ‌కులు మీడియా ద్వారా విజ్ఞ‌ప్తి చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

నిద్ర‌లేసింది మ‌హిళా లోకం….ద‌ద్ద‌రిల్లింది పురుష ప్ర‌పంచం అనే పాట విన్నాం క‌దా! నిద్ర‌లేసింది మ‌హిళా లోకం…బెంబేలెత్తుతోంది పురుష ప్ర‌పంచం అని పాడుకోవాల్సిన ప‌రిస్థితులు వ‌చ్చాయ‌ని భార్యా బాధితులు వాపోతున్నారు.
భార్యా బాధితులంతా క‌ల‌సి ‘సేవ్‌ ఇండియన్‌ ఫ్యామిలీ ఫౌండేషన్‌’ అనే సంస్థ‌గా ఏర్పాట‌య్యారు. మ‌హిళ‌ల కోసం క‌మిష‌న్ ఉన్న‌ట్టుగా పురుషుల కోసం ప్ర‌త్యేక క‌మిష‌న్ ఏర్పాటు చేయాల‌ని ఫౌండేష‌న్ అధ్య‌క్షుడు రాజేశ్ వ‌కారియా డిమాండ్ చేస్తున్నారు.

కుటుంబ సమస్యల కారణంగా దేశంలో ప్రతి ఆరున్నర నిమిషాలకో మగవాడు ఆత్మహత్య చేసుకుంటున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ త‌గాదాల‌న్నీ ఒకే గొడుగు కిందికి తెచ్చి మ‌గ‌వాళ్లను క‌ష్టాల క‌డ‌లి నుంచి బ‌య‌ట‌ప‌డేయాల‌ని అత‌ను వేడుకుంటున్నాడు.
 
 ఈ నెల 14,15 తేదీల్లో సికింద్రాబాద్‌ క్లాక్‌టవర్‌ సమీపంలోని పద్మినీ హోటల్లో నిర్వ‌హించే స‌ద‌స్సులో బాధితులు పాల్గొని తమ అనుభవాలను తెలియజేస్తారని ఆయ‌న తెలిపారు