భార్య‌పై అక్ష‌య్‌కు ఎంత ‘ఘాటు’ ప్రేమో…

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అక్ష‌య్‌కుమార్ త‌న భార్య‌కు ఉల్లితో అలంక‌రించిన ఇయ‌ర్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా అందించిన త‌న ప్రేమ ఎంత “ఘాటైందో” చాటుకున్నాడు. భ‌ర్త అక్ష‌య్‌కుమార్‌తో ప్రేమ‌తో ఇచ్చిన ఉల్లి ఇయ‌ర్ రింగ్స్ ఎంతో బాగున్నాయ‌ని…

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అక్ష‌య్‌కుమార్ త‌న భార్య‌కు ఉల్లితో అలంక‌రించిన ఇయ‌ర్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా అందించిన త‌న ప్రేమ ఎంత “ఘాటైందో” చాటుకున్నాడు. భ‌ర్త అక్ష‌య్‌కుమార్‌తో ప్రేమ‌తో ఇచ్చిన ఉల్లి ఇయ‌ర్ రింగ్స్ ఎంతో బాగున్నాయ‌ని ఆమె కూడా మురిసిపోయింది. అంతేకాదు వాటిని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి త‌మ ఘాటైన ప్రేమ ముచ్చ‌ట్ల‌ను సోష‌ల్ మీడియా ద్వారా లోకానికి తెలియ‌జేసింది.

దేశంలో ఉల్లి ధ‌ర‌ల ఘాటు రాజ‌కీయాల‌ను కూడా హీటెక్కించాయి. ఈ నేప‌థ్యంలో ర‌క‌ర‌కాల రూపంలో రాజ‌కీయ నేత‌లు, సినీరంగ సెల‌బ్రిటీలు త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ స‌మావేశాల‌కు ప్ర‌తిప‌క్ష టీడీపీ ఎమ్మెల్యేలు ఉల్లిపాయ‌ల‌ను దండ‌లుగా అమ‌ర్చి వాటిని మెళ్ల‌లో వేసుకుని హాజ‌రై నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

తాజాగా ముంబ‌య్‌లో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అక్ష‌య్‌కుమార్ త‌న భార్య‌కు ఉల్లి రింగ్స్ గిఫ్ట్‌గా ఇవ్వ‌డం స‌మ‌స్య తీవ్ర‌త‌ను వినూత్నంగా చెప్పిన‌ట్టైంది. “గుడ్‌న్యూస్” చిత్రంలో అక్ష‌య‌కుమార్‌కు జంట‌గా క‌రీనాక‌పూర్ న‌టించారు. ఈ సినిమా ప్రమోష‌న్స్‌లో భాగంగా వారు ది క‌పిల్‌శ‌ర్మ షోకు హాజ‌ర‌య్యారు. షోలో భాగంగా ఉల్లితో తీర్చిదిద్దిన ఇయ‌ర్ రింగ్స్‌ను హీరోయిన్‌కి అక్ష‌య్ చూపారు. ఎందుక‌నో వాటిని ఆమె ఇష్ట‌ప‌డ‌లేదు.

వెంట‌నే వాటిని ఇంటికి తీసుకెళ్లి త‌న భార్య ట్వింకిల్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారాయ‌న‌. క‌రీనాకు న‌చ్చ‌ని విష‌యాన్ని కూడా ఆమె త‌న అభిమానుల‌తో పంచుకున్నారామె. అంతేకాదు ఒక్కోసారి ఇలాంటి చిన్న‌చిన్న ప్రేమ వ్య‌వ‌హారాలే హృద‌యానికి హ‌త్తుకుంటాయ‌ని మురిసిపోయారు. ఆనియ‌న్ ఇయ‌ర్ రింగ్స్ బెస్ట్ గిఫ్ట్ అని ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో త‌మ ఘాటు ప్రేమ గురించి చెప్పుకొచ్చారు.