సీమ క‌డ‌గండ్ల‌పై మైసూరా ఆసక్తిక‌ర క‌థ‌

డాక్ట‌ర్ ఎంవీ మైసూరారెడ్డి… ప‌రిచ‌యం అక్క‌ర్లేని రాజ‌కీయ‌నేత‌. రాయ‌ల‌సీమ ఉద్య‌మ‌కారుడిగా, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ స‌మ‌కాలికుడిగా రాజ‌కీయ ప్ర‌స్థానం సాగించారు. కాంగ్రెస్ హ‌యాంలో మంత్రిగా ప‌నిచేశారు.  Advertisement ఒక‌ప్పుడు అసెంబ్లీలో టీడీపీ పాలిట సింహ‌స్వ‌ప్నంగా…

డాక్ట‌ర్ ఎంవీ మైసూరారెడ్డి… ప‌రిచ‌యం అక్క‌ర్లేని రాజ‌కీయ‌నేత‌. రాయ‌ల‌సీమ ఉద్య‌మ‌కారుడిగా, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ స‌మ‌కాలికుడిగా రాజ‌కీయ ప్ర‌స్థానం సాగించారు. కాంగ్రెస్ హ‌యాంలో మంత్రిగా ప‌నిచేశారు. 

ఒక‌ప్పుడు అసెంబ్లీలో టీడీపీ పాలిట సింహ‌స్వ‌ప్నంగా గుర్తింపు పొందారు. ఎవ‌రా బిగ్‌బాస్ అంటూ అసెంబ్లీలో చంద్ర‌బాబుకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం వైఎస్సార్‌తో విభేదాల వ‌ల్ల …అదే చంద్ర‌బాబు వెంట న‌డిచిన మైసూరా గురించి కూడా తెలిసిందే.

ప్ర‌స్తుతం ఆయ‌న ఏ రాజకీయ పార్టీలోనూ లేరు. సీమ సాగునీటి స‌మ‌స్య‌ల‌పై త‌న‌దైన అవ‌గాహ‌న‌తో వివిధ మాధ్య‌మాల వేదిక‌గా గళాన్ని వినిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా త‌న ఫేస్‌బుక్ ఖాతాలో సీమ‌కు జ‌రుగుతున్న అన్యాయంపై ఆస‌క్తిక‌ర క‌థ రాసుకొచ్చారు. అదేంటో చూద్దాం.

“దేవేంద్రుడికి రాయలసీమ మీద కోపం వచ్చి మేఘాలను పీల్చి రాయలసీమలో వర్షాలు కురవద్దని ఆదేశించారట. అందులో ఒకటి చెవిటి మేఘం, మరొకటి గుడ్డి మేఘం. చెవిటిది, గుడ్డిది రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కుండ పోతగా వర్షం కురిపించాయి. దానితో రైతులు విత్తనం వేశారు. చెవిటి మేఘం, గుడ్డి మేఘం వర్షించాయని, రైతులు విత్తనం బాగా వేసుకున్నారని దేవేంద్రుడికి తెలిసింది. రెండు మేఘాల మీద కన్నెర్ర చేశాడంట. 

చెవిటిది వినపడక, గుడ్డిది కనపడక వర్షించామని, ఇక వర్షించమ‌ని, మా తప్పుని మన్నించండ‌ని వేడుకున్నాయ‌ట‌. మా వల్ల రైతులకు రెండు విధాలా ఇబ్బంది జరుగుతుంది. పంట చేతికొచ్చే సమయంలో వర్షంలేక… పంట ఎండిపోయి, ఆర్థికంగా నష్టపోతారు. ముందు కురిసిన వర్షం వల్ల సాలు వర్షపాతం ఎక్కువ వచ్చి కరవు ప్రాంతంగా ప్రకటించక ఆర్థిక సహాయం అందదు. మేము చేసిన పని వలన రైతులకు గోడవేటు, చెంపచేటు. రెండు విధాలుగా నష్టం జరిగింది కదా! అన్నాయట. దేవేంద్రుడు శ‌భాష్ అని మెచ్చుకున్నారట!” ఇది మైసూరా చెప్పిన క‌థ‌. 

దీన్ని ఏ ర‌కంగానైనా అన్వ‌యించుకోవ‌చ్చు. రాయ‌ల‌సీమ‌పై పాల‌కుల వివ‌క్ష‌ను చాటి చెప్పేందుకు మైసూరా ఈ క‌థ చెప్పార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.