Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - National

ఈ పదేళ్లలో ఎన్నికల ఖర్చు ఎంత పెరిగిందో తెలుసా?

ఈ పదేళ్లలో ఎన్నికల ఖర్చు ఎంత పెరిగిందో తెలుసా?

2019 సార్వత్రిక ఎన్నికలు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా చరిత్రలో నిలిచాయి. ఢిల్లీకి చెందిన ఓ స్వతంత్ర సంస్థ ఈ ఖర్చును లెక్కగట్టింది. 75 రోజుల పాటు సాగిన ఎన్నికల ప్రక్రియలో దేశవ్యాప్తంగా 55వేల కోట్ల రూపాయల నుంచి 60వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు జరిగినట్టు అంచనా వేసింది.

ఇప్పుడీ రికార్డును 2024 సార్వత్రిక ఎన్నికలు క్రాస్ చేయడం గ్యారెంటీ అంటున్నాయి కొన్ని స్వతంత్ర సంస్థలు. అసోసియేషన్ ఫర్ డెమక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ చేసిన సర్వేలు, విశ్లేషణల్లో... 2024 సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలవబోతున్నాయట.

2019 ఎన్నికల్లో జాతీయ పార్టీలు తమ ఎన్నికల బడ్జెట్ లో 50.58 శాతం ప్రచారానికి ఖర్చుపెట్టగా.. 19.68శాతం ప్రయాణ ఖర్చులకు, 15.43 శాతం అభ్యర్థులకు, 14.31 శాతం ఇతర ఖర్చులకు కేటాయించాయి. ఈ పదేళ్లలో ఈ అంచనాలు ఎన్నో రెట్లు పెరిగాయి.

ప్రస్తుతం ప్రచారం వ్యయం 641శాతంగా ఉంది. పార్టీలు తమ అభ్యర్థులపై పెడుతున్న ఖర్చు ఏకంగా 416 శాతం పెరిగింది. దేశవ్యాప్తంగా సగటున ప్రతి అభ్యర్థి 20 కోట్ల రూపాయల మేరకు ఖర్చు చేస్తున్నారట. కొన్ని సెగ్మెంట్లలో ఈ ఖర్చు 50 కోట్ల రూపాయలు కూడా దాటేసిందని చెబుతున్నారు.

ఎన్నికల ఖర్చులో ఇప్పుడు తాయిలాలకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తున్నారట. ఒకప్పుడు ప్రజలకు పంచే డబ్బు, ఇచ్చే బహుమతులు సెగ్మెంట్ల వారీగా లోపాయికారీగా జరిగిపోయేది. ఎక్కడికక్కడ ఎడ్జెస్ట్ మెంట్లు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు వీటి కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తున్నట్టు చెబుతున్నారు. ఓటర్లకు ఎంత ఇస్తున్నామనే అంశంపైనే గెలుపు ఆధారపడి ఉందని దాదాపు అన్ని పార్టీలు, అభ్యర్థులు నమ్ముతున్నారట.

దేశంలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్, పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల సంఘం సూచించిన పరిమితికి మించి 12 రెట్లు అధికంగా అభ్యర్థులు ఖర్చు చేస్తున్నట్టు తేలింది.

బిహార్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీకి చెందిన అధికారి ఎన్నికలపై మరో కీలక ప్రకటన చేశారు. ఎన్నికల వల్ల చాలా ధనం జనబాహుళ్యంలోకి వస్తోందని ఆయన అన్నారు. ప్రకటన రూపంలో వేల కోట్ల రూపాయలు మార్కెట్లోకి వస్తోందని.. విశ్లేషకులు, కంటెంట్ క్రియేటర్లు, కన్సల్టెంట్లకు భారీగా డబ్బులొస్తున్నాయని చెబుతున్నారు.

నల్లధనం బాగా తగ్గి, మార్కెట్లు కళకళలాడుతూ.. దేశంలో ధనప్రవాహం పెరుగుతుందంటున్నారయన. అయితే ఎన్నికల తర్వాత తిరిగి చాలా డబ్బు బ్లాక్ మార్కెట్లోకి వెళ్లిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవరాల్ గా ఈసారి సార్వత్రిక ఎన్నికలు లక్ష కోట్ల రూపాయల మార్క్ ను టచ్ చేసే అవకాశం ఉందంటున్నాయి చాలా సర్వేలు. ఎన్నికలు బాగా కాస్ట్ లీ అయిపోయాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?