6 కోట్ల ఏళ్లనాటి సాలగ్రామ శిలతో అయోధ్య రాముడు

అయోధ్య రామమందిరంలో శ్రీరామచంద్రమూర్తి శిల్పాన్ని మలిచేందుకు తీసుకొచ్చిన సాలగ్రామ శిలలు 6కోట్ల సంవత్సరాల పురాతనమైనవి. వీటిని నేపాల్ నుంచి తీసుకొచ్చారు. నేపాల్‌లోని జనక్‌ పూర్ నుంచి సాలగ్రామాలను అయోధ్యకు తరలించారు. ఈ రెండు సాలగ్రామాల్లో…

అయోధ్య రామమందిరంలో శ్రీరామచంద్రమూర్తి శిల్పాన్ని మలిచేందుకు తీసుకొచ్చిన సాలగ్రామ శిలలు 6కోట్ల సంవత్సరాల పురాతనమైనవి. వీటిని నేపాల్ నుంచి తీసుకొచ్చారు. నేపాల్‌లోని జనక్‌ పూర్ నుంచి సాలగ్రామాలను అయోధ్యకు తరలించారు. ఈ రెండు సాలగ్రామాల్లో ఒకటి 26 టన్నుల బరువు ఉండగా, రెండోదాని బరువు 14 టన్నులు.

ఈ సాలగ్రామ శిలల్ని నేపాల్ నుంచి ప్రత్యేక ట్రక్కుల్లో అయోధ్యకు చేర్చారు. రామజన్మభూమి ట్రస్ట్ కి అందించారు. నేపాల్ లోని గండకీ నది సాలగ్రామాలకు ప్రసిద్ధి. గండకీ నదిలోని పురాతన సాలగ్రామాలను ఇప్పుడు అయోధ్య రాముడి విగ్రహం కోసం తరలించారు.

51 మంది వేదపండితులతో పూజలు..

ఈ సాలగ్రామాలకు నేపాల్ లో 51మంది వేద పండితులతో పూజలు చేయించారు. నేపాల్ లోని జానకీ మందిర్ నిర్వాహకులు మహంత్ తాపేశ్వర్ దాస్.. వీటిని జాగ్రత్తగా భారత్ చేర్చారు. రామ మందిర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ కి వీటిని అందించారు.

బాల రూపం కోసం..

శ్రీరాముడి బాలరూపాన్ని చెక్కేందుకు ఈ శిలలను తీసుకొచ్చారు. త్వరలోనే ఈ సాలగ్రామాలపై శ్రీరామ బాలరూపాలు కొలువుతీరనున్నాయి. అయోధ్య రామమందిరంలో జనవరి 2024 నుంచి భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తారు.

విశ్వ హిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి రాజేంద్ర సింగ్ పంకజ్.. ఈ సాలగ్రామాలతో నేపాల్ నుంచి బయలుదేరి అయోధ్యకు వచ్చారు. నేపాల్ లోని ముస్తాంగ్ జిల్లా నుంచి సాలగ్రామాలను జనవరి 25న తీసుకుని బయలుదేరి, ఇప్పుడు అయోధ్య చేరారు. ఈ సాలగ్రామ శిలల వయసు 6కోట్ల సంవత్సరాలు.

నేపాల్ లోని ముస్తాంగ్ జిల్లాలో ముక్తినాథ్ అనే ప్రాంతం నుంచి ఈ సాలగ్రామాలను తీసుకొచ్చారు. గండకి నది నుంచి వీటిని సంగ్రహించారు. అత్యంత పవిత్రమైన సాలగ్రామాలు అయోధ్యకు చేరుకున్నాయి. వీటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.