రాత్రంతా అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు!

ఢిల్లీలో రాజ‌కీయం వాడివేడిగా సాగుతోంది. అవినీతి ఆరోప‌ణ‌ల‌పై రెండు పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతున్న నేప‌థ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్ర‌తిప‌క్ష బీజేపీ ఎమ్మెల్యేలు రాత్రంతా అసెంబ్లీలోనే గ‌డిపారు. Advertisement సొంత ప్ర‌భుత్వంపైనే…

ఢిల్లీలో రాజ‌కీయం వాడివేడిగా సాగుతోంది. అవినీతి ఆరోప‌ణ‌ల‌పై రెండు పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతున్న నేప‌థ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్ర‌తిప‌క్ష బీజేపీ ఎమ్మెల్యేలు రాత్రంతా అసెంబ్లీలోనే గ‌డిపారు.

సొంత ప్ర‌భుత్వంపైనే విశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టిన ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ బీజేపీపై విరుచుప‌డ్డారు. త‌మ ఎమ్మెల్యేల‌ను డ‌బ్బుతో కొని బీజేపీ త‌మ ప్ర‌భుత్వంను కూల్చాలని చూస్తోందంటూ ఆరోపించారు.

విశ్వాస తీర్మానంపై జ‌రిగిన చ‌ర్చ సంద‌ర్భంగా మాట్లాడినా ఆప్‌ ఎమ్మెల్యే దుర్గేశ్‌ పాఠక్ ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనాపై అవినీతి అరోప‌ణ‌లు కురిపించారు. 2016లో జరిగిన నోట్ల రద్దు సమయంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ ఛైర్మన్‌గా ఉన్న సక్సేనా.. తన ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి రూ.1400 కోట్ల విలువైన పాత నోట్లను మార్పిడి చేయించారని ఆరోపించారు.  

లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ పై ఆప్ నేత‌లు సీబీఐకు ఫిర్యాదు చేయాబోతున్న‌ట్లు చెప్పారు. మ‌రోవైపు బీజేపీ నేత‌లు మాత్రం ఢిల్లీ బడుల్లో, క్లాస్ రూంల నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఇచ్చిన రిపోర్ట్ పైనా చర్చకు పట్టుబ‌డుతున్నారు. 

ఒక‌వైపు ఆప్ మంత్రుల‌పై సీబీఐ దాడుల నేప‌థ్యంలో ఆప్ పార్టీ కూడా లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ఆరోప‌ణ‌లు చేయ‌డంతో ఢిల్లీ రాజ‌కీయం వేడెక్కింది.