సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై షాకింగ్ కామెంట్ల్ చేశారు. ఢిల్లీలో రాజకీయ దుమారం లేపిన లిక్కర్ స్కామ్ పై సీఎం కేజ్రీవాల్ కు లేఖ రాశారు. సీఎం కేజ్రీవాల్ అధికార మత్తులో మునిగిపోయారని ఆరోపించారు.
'మీరు రాజీయాల్లోకి వచ్చిన తర్వాత మీ ఫిలాసఫీని మరచిపోయారనీ, అందుకే ఢిల్లీ కోసం నూతన మద్యం పాలసీను తెచ్చిరన్నారు. ఇలాంటివి పెద్ద ఉద్యమం నుండి పుట్టిన రాజకీయ పార్టీకి తగదు' అంటూ సీఎం కేజ్రీవాల్ కు చురకలు అంటించారు.
మీరు మీ పార్టీ కూడా ఇతర పార్టీ, నాయకుల మాదిరిగానే డబ్బు, అధికారం అనే విష వలయంలో చిక్కుకున్నట్టున్నారు. మీరు తెచ్చిన కొత్త మద్యం పాలసీ వలన మద్యం వినియోగం పెరుగుతుందన్నారు ఇది ప్రజలకు మంచిది కాదన్నారు. మా గ్రామంలో మద్యపానం నిషేదిస్తే అప్పట్లో మీరు అభినందించారు కానీ ఇప్పుడు మీరు మద్యం వినియోగం పెంచుతున్నరంటూ లేఖలో ఘటూగా వ్యాఖ్యనించారు.
ఢిల్లీ మద్యపాన విషయంలో ఇప్పటికే రాజకీయ దూమరంతో పాటు, సీబీఐ కేసుల వరకు వెళ్లాయి. ఇప్పుడు అన్నా హజారే లేఖతో రాజకీయాలు ఎటువైపు వెళ్తాయో అశక్తిగా ఉంది. ఎందుకంటే అన్నా హజారే, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇద్దరు కలిసి ఎన్నో ప్రజా ఉద్యమాలు చేశారు.