Advertisement

Advertisement


Home > Politics - National

జైలు నుంచే కేజ్రీవాల్ పాలనా!

జైలు నుంచే కేజ్రీవాల్ పాలనా!

అందరూ ఊహించినట్లే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టయ్యారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో ఆయ‌న‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఈడీ ఆఫీస్‌కు త‌ర‌లిస్తున్నారు. దీంతో ఆయ‌న నివాసం వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది. కేంద్రానికి వ్య‌తిరేకంగా ఆమ్ అద్మీ పార్టీ కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌కు దిగారు. 

కాగా త‌న‌కు అరెస్ట్ నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కేజ్రీవాల్ హైకోర్టులో పిటిష‌న్ వేయాగా.. అరెస్ట్ నుంచి ఎటువంటి మిన‌హాయింపు ఇవ్వ‌లేమ‌ని ఇవాళ ధ‌ర్మాస‌నం సృష్టం చేసింది. దీంతో ఇవాళ సాయంత్రం సెర్చ్ వారెంట్‌తో కేజ్రీవాల్ ఇంటికి వెళ్లిన‌ ఈడీ అధికారులు ఆయ‌న నివాసంలో సోదాలు నిర్వ‌హించారు. సోదాలు అనంత‌రం అరెస్ట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. లిక్క‌ల్ స్కాం కేసులో ఇప్ప‌టికే 9 సార్లు ఈడీ విచార‌ణ‌కు డుమ్మా కొట్టారు. 

ఇప్ప‌టికే ఈ కేసులో ఢిల్లీ ఉప‌ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా అరెస్టై జైల్లో ఉన్నారు.. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. దీంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. కాగా ఇదే కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను కూడా అరెస్టై జైల్లో ఉన్న విష‌యం తెలిసిందే.

మ‌రో వైపు ఢిల్లీ సీఎంగా అర‌వింద్ కేజ్రీవాలే కొన‌సాగుతార‌ని మంత్రి, ఆప్ సీనియ‌ర్ నేత అతిశీ తెలిపారు. జైలు నుండే ప్రభుత్వాన్ని నడుపుతార‌ని.. అరెస్ట్‌పై సుప్రీంకోర్టును ఆశ్ర‌యించామ‌ని ఆమె తెలిపారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?