ఘంటసాల గారికి భారతరత్న: సంతకాల సేకరణ

శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి శతజయంతి సందర్భంగా, భారత సంగీత రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గానూ మరణానంతరం భారతరత్న పురస్కారంతో గుర్తించవలసిందిగా భారత ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలలో…

శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి శతజయంతి సందర్భంగా, భారత సంగీత రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గానూ మరణానంతరం భారతరత్న పురస్కారంతో గుర్తించవలసిందిగా భారత ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలలో నివశించేవారే కాకుండా ప్రపంచం నలుమూలలా ఉన్న 15 కోట్ల మంది తెలుగు మాట్లాడే ప్రజలు కోరుకుంటున్నారు.

శ్రీ ఘంటసాల గారు ఒక లెజెండ్! వ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందినది మరియు వారి దివ్యమైన స్వరాన్ని ప్రతిబింబిస్తుంది, ఇది భారతదేశంలో అత్యధికంగా వినబడే రికార్డింగ్‌లలో ఎప్పటికీ ఒకటి.

ఘంటసాల గారి గురుంచి కొన్ని వివరాలు క్లుప్తంగా:

1. అమరగాయకుడుగా మరియు సంగీత దర్శకుడుగా 10,000 పైగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ మరియు తులు బాషలలో పాటలుతో పాటు అనేక ప్రైవేట్ ఆల్బమ్స్ కి (పుష్ప విలాపం, కుంతీ విలాపం, దేశభక్తి గీతాలు) పాడటం మరియు వ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత.

2. సంగీత దర్శకుడుగా 110 కంటే ఎక్కువ సినిమాలుకు సంగీత దర్శకత్వం వహించి ఆణిముత్యాలాంటి పాటలను అందించారు.

3. వాగ్గేయకారుడుగా పాటలను రచించి, సంగీత స్వర కల్పన కూర్చి మరియు వారి అమృత గాత్రంతో ఆ పాటలకు జీవం పోశారు. ఉదాహరణకు బహుదూరపు బాటసారి, ఇటు రావోయి ఒక్కసారి మొదలగు పాటలు అలాగే 15 వ శతాభ్దం అన్నమయ్య తరువాత తిరుపతి దేవషానం గర్భగుడిలో పాటలు పాడిన ఏకైక గంధర్వ గాయకుడు.

4. పిన్న వయస్సులోనే దేశంకోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడుగా (1942 క్విట్ ఇండియా ఉద్యమం) 18 నెలల జైలు శిక్షని అనుభవించారు, అనేక దేశభక్తి గీతాలను పాడి ప్రజలను భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొనడానికి వారిని ప్రేరేపించారు. స్వాతంత్య్రానంతరం ఈ పాటలను అధికారికంగా రికార్డ్ చేయడం వలన అవి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి.

5. భారత ప్రభుత్వం 1970లో శ్రీ ఘంటసాలని పద్మశ్రీతో గుర్తించింది. 2003లో ఆయన గౌరవార్థం ఒక తపాలా బిళ్ళను విడుదల చేశారు. భారత ప్రభుత్వం ప్రచురించిన(సన్స్ ఆఫ్ సాయిల్) పుస్తకములో ఘంటసాల గారి పేరు కూడా చేర్చడం ఆయన దేశభక్తికి నిదర్శనం.

ఈ సంవత్సరం ఆయన శతజయంతి వేడుకలు జరుపుకుంటున్నందున, ఆయన చేసిన ఎనలేని సేవలకు గుర్తింపుగా ఇప్పుడు ఆయనను భారతరత్నతో  పురస్కరించి గౌరవించడం ఇదే ఉత్తమ ఘననివాళి.

దయచేసి ఈ లింకు పైన క్లిక్ చేసి మీ అమూల్యమైన సంతకం చేయగలరు!

https://www.change.org/BharatRatnaForGhantasalaGaru