Advertisement

Advertisement


Home > Politics - National

ఘోరం.. విద్యార్థులతో వెళ్తున్న పడవ మునక

ఘోరం.. విద్యార్థులతో వెళ్తున్న పడవ మునక

గుజరాత్ లో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న పడవ నీటమునిగింది. ఈ దారుణ ఘటనలో ఏకంగా 16 మంది విద్యార్థులు మృతిచెందినట్టు ప్రాధమిక సమాచారం.

వడోదరలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థుల్ని విహార యాత్రకు తీసుకెళ్లారు. సిటీ శివార్లలో ఉన్న హర్ని నదికి అంతా వెళ్లారు. విహారయాత్రలో భాగంగా 27 మంది విద్యార్థులతో ఉన్న బోటు నదిలోకి కదిలింది. కొంతదూరం ఇలా వెళ్లిందో లేదో అంతలోనే బోటు మునిగిపోయింది.

పడవ మునుగుతున్న సమయంలో విద్యార్థులు హాహాకారాలు చేశారు. అది గమనించిన స్థానికులు వెంటనే నీళ్లలోకి దూకి 10 మంది చిన్నారుల్ని రక్షించగలిగారు. ఈ ఘోర దుర్ఘటనలో ముందుగా ఐదుగురు మృతిచెందినట్టు భావించారు. ఆ తర్వాత మృతుల సంఖ్య 16కు చేరినట్టు తెలుస్తోంది.

ప్రాణాలతో బయటపడిన చిన్నారులను వడోదరలోని వివిధ హాస్పిటల్స్‌ లో అత్యవసర చికిత్స కోసం చేర్పించారు. వాళ్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా వాళ్లు కోలుకుంటున్నారు.

జరిగిన దుర్ఘటనపై ప్రధాని కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తునకు ఆదేశించింది గుజరాత్ సర్కారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?