Advertisement

Advertisement


Home > Politics - National

ఇదో కొత్త ట్రెండ్.. టేబుల్ ఆఫ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్

ఇదో కొత్త ట్రెండ్.. టేబుల్ ఆఫ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్

లవ్ ఎఫైర్ ఉన్న అమ్మాయి ఆ అబ్బాయిని కాదని, ఇంకొకర్ని మరో పెళ్లి చేసుకుంటుంటే.. తన పాత లవర్ లేదా లవర్స్ పెళ్లి మండపం దరిదాపులకు రాకుండా ఉండాలనుకుంటారు. ఒకవేళ ఎవరైనా వచ్చినా పెళ్లిలో గొడవ చేయకూడదని భావిస్తారు. తనకు కాబోయే వాడికి తన ఎక్స్ ల గురించి ఎక్కడ తెలిసిపోతుందోనని టెన్షన్ పడతారు.

కానీ చైనాలో ఓ పెళ్లికూతురు మాత్రం ఓ సాహసం చేసింది. మాజీ లవర్స్ కోసం పెళ్లి మండపంలో ఏకంగా ఓ టేబుల్ రిజర్వ్ చేసి పెట్టింది. అక్కడ "టేబుల్ ఆఫ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్" అనే నేమ్ ప్లేట్ కూడా పెట్టించింది.

చైనా సోషల్ మీడియాలో ఇప్పుడిదే పెద్ద హాట్ టాపిక్ గా మారింది. టేబుల్ ఆఫ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ దగ్గర ఐదుగురు అబ్బాయిలు కూడా కూర్చున్న వీడియో వైరల్ గా మారింది. అంతకంటే విశేషం ఏంటంటే వారంతా ఒకేరకంగా ఉండటం. అదే టేబుల్ దగ్గర మరో మహిళ కూడా కూర్చోవడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లతో ఆటాడేసుకుంటున్నారు.

ఆళ్లు మగాళ్లురా బుజ్జీ..

హ్యాండిచ్చేసిన ప్రేయసి తన పెళ్లికి రావాలంటూ వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపిస్తే ఎవరైనా ఏం చేస్తారు. మరింత దిగులుపడతారు. కానీ ఆ పెళ్లికి వచ్చిన ఐదుగురు ఎక్స్ లు బాగా ధైర్యవంతులని, అందుకే ఆమె పెళ్లికి వచ్చారని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అసలు వారికంటే ఎక్కువ దైర్యం ఆ అమ్మాయిదని, అందుకే అంత డేర్ గా వారిని పెళ్లికి పిలిచి, టేబుల్ కూడా ఏర్పాటు చేసిందని మరికొందరు అంటున్నారు.

ఇక ఆ టేబుల్ దగ్గర కూర్చున్న అమ్మాయి సంగతేంటనేది కూడా చర్చకు వచ్చింది. ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ లో ఎవరో ఒకరి కొత్త గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుందని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. తనను పెళ్లికి పిలిచిన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి తన కొత్త గర్ల్ ఫ్రెండ్ ని చూపించేందుకే ఆమెను తీసుకొచ్చి ఉంటాడని అనుకుంటున్నారు.

పెళ్లి కొడుకుని చూడాల్సిన పనిలేదు...

ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ టేబుల్ దగ్గర కూర్చున్న ఐదుగురు యువకులు ఒకే పోలికతో ఉండటం మరో విశేషం. అమ్మాయి లవర్స్ ని మార్చినా.. ఒకేరకంగా ఉండేవారిని ఏరికోరి సెలక్ట్ చేసుకుందని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఆ ఐదుగురిని వీడియోలో చూసిన తర్వాత పెళ్లి కొడుకు ఎలా ఉంటాడో ఈజీగా ఊహించేసుకోవచ్చని అంటున్నారు.

మొత్తమ్మీద "టేబుల్ ఆప్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్" అనేది ఇప్పుడు చైనా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. మన దగ్గర అమ్మాయిలు ఇలాంటి ప్రయోగాలు చేయరేమో. ఎందుకంటే.. ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ని మార్చినా, భర్తే తమ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకోవడం ఇక్కడ ఫ్యాషన్ కదా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?