Advertisement

Advertisement


Home > Politics - National

సీఎం హేమంత్ సొరెన్ రాజీనామా!

సీఎం హేమంత్ సొరెన్ రాజీనామా!

ఝార్ఖండ్ రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్.. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సొరెన్ తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేయ‌నున్న నేప‌ధ్యంలో ముంద‌స్తుగా త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లు తెలుస్తోంది.

హేమంత్ సొరెన్‌ అరెస్టు తరువాత త‌న భార్య క‌ల్పనా సొరెన్ సీఎం ప‌గ్గాలు చేప‌ట్ట‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చినా అనూహ్యంగా జేఎంఎం శాస‌న‌స‌భ‌ప‌క్ష నేత‌గా చంపై సొరెన్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. హేమంత్ సొరెన్ క్యాబినెట్‌లో చంపై సొరెన్ ర‌వాణా, వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల సంక్షేమ శాఖ మంత్రిగా ప‌ని చేశారు.

కాగా భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో విచారణ చేసేందుకు 10 రోజుల వ్యవధిలో రెండోసారి హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గ‌త 24 గంట‌ల వ‌ర‌కు ఎవ‌రికి క‌న‌ప‌డ‌కుండా పోయిన ఆయ‌న ఇవాళ ఉద‌యం ఝార్ఖండ్‌లో ప్ర‌త్య‌క్షం అయి విచార‌ణను ఎదుర్కొంటున్నారు. ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న తరుణంలో సొరెన్ అరెస్టు కానున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో సొరెన్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో 144 సెక్షన్‌ను పోలీసులు విధించారు.

కాగా త‌న‌ను విచార‌ణ చేస్తున్న ఈడీ అధికారుల‌పై హేమంత్ సొరెన్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే బీహార్‌, ఝార్ఖండ్ రాష్ట్ర‌ రాజ‌కీయాల్లో కీల‌క మార్పులు జరిగాయి. మ‌రోవైపు ఇవాళ‌ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఐదోసారి ఈడీ సమన్లు జారీ చేసిన విష‌యం తెలిసిందే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?