ఆ దర్శకుడికి రూ.1000 కోట్లు ఆఫర్

మీరు చదివింది నిజమే. అచ్చు తప్పు కాదు, అక్షరాలా వెయ్యి కోట్ల ఆఫర్. ఇప్పటివరకు రాజమౌళికి కూడా దక్కని ఆఫర్ ఇది. సినిమా తీస్తే వెయ్యి కోట్లు బడ్జెట్ పెడతానంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మకు…

మీరు చదివింది నిజమే. అచ్చు తప్పు కాదు, అక్షరాలా వెయ్యి కోట్ల ఆఫర్. ఇప్పటివరకు రాజమౌళికి కూడా దక్కని ఆఫర్ ఇది. సినిమా తీస్తే వెయ్యి కోట్లు బడ్జెట్ పెడతానంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మకు ఓ ఆఫర్ వచ్చింది. ఈ విషయాన్ని అతడే స్వయంగా బయటపెట్టాడు.

“నాకు వంద కోట్లు, 200 కోట్లు ఆఫర్లు ఉన్నాయి. మొన్న ఒక వ్యక్తి ఏకంగా వెయ్యి కోట్లు ఆఫర్ చేశారు. హనుమాన్ చూసిన ఓ ఎన్నారై ఈ ఆఫర్ ఇచ్చారు. మన ఇతిహాసాన్ని ఇలా చెబితే కనుక రేపు పొద్దున్నే వెయ్యి కోట్లు పంపిస్తాను, సినిమా చేయమని ఆఫర్ ఇచ్చారు.”

అమెరికాకు చెందిన ఓ ఎన్నారై వైద్యుడు తనకు ఈ ఆఫర్ ఇచ్చినట్టు వెల్లడించాడు ప్రశాంత్. ఇక్కడ ఎంత పెడుతున్నామనేది ముఖ్యం కాదని.. పెట్టిన డబ్బుకు క్వాలిటీ చూపించామా లేదా అనేది ముఖ్యం అంటున్నాడు ఈ డైరక్టర్. తనకు 30 కోట్ల బడ్జెట్ ఇస్తే దాన్ని 50 కోట్ల సినిమాగా మలుస్తానని.. 50 కోట్ల బడ్జెట్ ఇస్తే 100 కోట్ల బడ్జెట్ సినిమాగా తయారుచేస్తానని, మనీ వేస్ట్ చేయనని అంటున్నాడు.

తను బడ్జెట్ లెక్కల్లోకి ఎప్పుడూ వెళ్లనని అంటున్నాడు. తను కేవలం కథను మాత్రమే చెబుతానని, ఇచ్చిన బడ్జెట్ లో సినిమా చేయలేనని కూడా ముందుగానే చెబుతానంటున్నాడు. తను చెప్పిన కథకు మార్కెట్ ఎంత ఉంటుందో అంచనా వేసుకోవాలని, ఆ తర్వాత సినిమా స్టార్ట్ చేయాలని క్లియర్ గా అందరికీ చెబుతానంటున్నాడు.

తను తీయబోయే జై హనుమాన్ సినిమాలో మహేష్ బాబు శ్రీరాముడిడిగా, చిరంజీవి ఆంజనేయస్వామిగా కనిపిస్తే చాలా బాగుంటుందని అంటున్నాడు. ఆల్రెడీ మహేష్ ను గ్రాఫిక్స్ లో రాముడిగా తయారుచేసి చూసుకున్నామని, అతడు చాలా బాగుంటాడని అంటున్నాడు.