గత రెండు దపాలుగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతు, సీనియర్ నాయకుల నుండి విమర్శలను ఎదుర్కోంటూ, అస్తిత్వం కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ నీ ఎలాగైనా కాపాడలని, మళ్ళీ అధికారం లోకి తీసుకు రావడానికి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 'భారత్ జోడో యాత్ర' ను చేయబోతున్నారు.
ఇవాళ రాహుల్ గాంధీ తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్ లోని తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారకాన్ని సందర్శించి నివాళులర్పించిన తరువాత.. ఈ రోజు సాయత్రం కన్యాకుమారి నుండి భారత్ జోడో యాత్ర మొదలు పెట్టనున్నారు. కన్యాకుమారి నుండి శ్రీనగర్ వరకు దాదాపు 3,570 కిలోమీటర్ల పాదయాత్ర దాదాపు ఐదు నెలల్లో 12 రాష్ట్రాలు మరియు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది.
కాంగ్రెస్ పార్టీ చరిత్రలో జాతీయ స్థాయిలో పాదయాత్ర చేపట్టడం ఇదే మొదటిసారి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల లక్ష్యంగా యాత్ర చేస్తున్నప్పటికి.. కేవలం భారత్ ను ఏకం చేయడమే లక్ష్యంగా ఈ యాత్ర ఉంటుందని, ఎన్నికలకు సంబంధించిన యాత్ర కాదని కాంగ్రెస్ పార్టీ చెపుతోంది.
కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం రావలంటే ముందుగా పార్టీలో అంతర్గత గోడవలు తగ్గించుకొవాలి. దేశంలో క్రమశిక్షణ లేని పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీయే. వాక్ స్వాతంత్రం పేరుతో సోంత పార్టీపైనే ఇష్టానుసారంగా మాట్లడేవారిని కట్టడి చేసి, సీనియర్లును పక్కన పెట్టి యువతకు ప్రాధాన్యం ఇచ్చి, ప్రజ పోరాటలు చేస్తే విజయం అందుకోలేకపోయిన కనీసం కాంగ్రెస్ పార్టీ ఘెర ఓటమి నుండి అయిన తప్పుకుంటుంది.