దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత వారం రోజుల నుంచి కొత్త కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 2,151 పాజిటివ్ కేసులు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో యాక్టివ్ కేసులు సంఖ్య 11, 903కు చేరింది. మహారాష్ట్రలో ముగ్గురు, కేరళ లో ముగ్గురు, కర్ణాటకలో ఒకరు చొప్పున మొత్తం ఏడుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,848గా నమోదైంది.
గతేడాది ఆక్టోబర్ తర్వాత ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవేనని తెలిపింది. గతేడాది అక్టోబర్ 28వ తేదీన 2,208 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కరోనా టెస్టులు పెంచాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించింది. మరోవైపు దేశంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 4,47,09,676కి చేరింది. ఇప్పటి వరకు 4,41,66,925 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలనూ ఇప్పటికే అలెర్ట్ చేసింది. మరోవైపు ఫ్లూ కేసులు కూడా పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్రా ప్రభుత్వాలు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. ఆ మేరకు ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పింది. ఏప్రిల్ 10,11 వ తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించనుంది.