దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 6,155 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటి తో పోలిస్తే 105 కేసులు పెరిగాయి.
తాజా కేసులతో కలిపి దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 31,194 కి చేరింది. ప్రస్తుతం రోజువారి పాజిటివిటీ రేటు 5.63% గా ఉంది. గత 24 గంటల్లో వైరస్ నుండి 3,253 మంది రికవరీ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా 11మంది మరణించారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను ఇప్పటికే కేంద్రం అప్రమత్తం చేసింది. అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సమీక్ష నిర్వహించారు. టెస్టులు, వ్యాక్సినేషన్ పెంచాలని సూచించారు. 10,11 తేదీల్లో కొవిడ్ హాస్పటల్లో మాక్‌డ్రిల్స్ నిర్వహించాలని కోరారు. కరోనా నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడాన్ని ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి.
దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ పెరగడానికి ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ కారణమై ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వైరస్‌లో మ్యుటేషన్లు జరుగుతున్న కొద్దీ ఇటువంటి కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.