Advertisement

Advertisement


Home > Politics - National

ఎన్నికల మేనిఫెస్టోలపై ఘాటు ఈసీ లేఖ!

ఎన్నికల మేనిఫెస్టోలపై ఘాటు ఈసీ లేఖ!

దేశంలోని అన్ని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం లేఖ రాసింది. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎలా నెర‌వేర్చుతార‌ని ఎన్నిక‌ల సంఘం రాజ‌కీయ పార్టీల‌ను ప్ర‌శ్నించింది. ఎన్నిక‌ల హామిల‌పై ఖ‌చ్చిత‌మైన సమాచారం ఇవ్వాల‌ని రాజ‌కీయ పార్టీల‌ను కోరింది.

ఎన్నిక‌ల వాగ్ధానాలు చేసే రాజ‌కీయ పార్టీలు వాటికి ఎలా నిధులు స‌మ‌కూరుస్తాయో వివ‌రాల‌ను తెలియ‌జేయాల‌ని, మీకున్న ఆర్థిక వ‌న‌రులేంటి అంటూ.. ఈ నెల 19వ తేదీలోపు వాటిపై సమాధానం చెప్పాల‌ని పేర్కొంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల ఆర్థికపరమైన చిక్కులు, వాటికి ఆర్థికసాయం చేసే మార్గాల గురించి చెప్పాల‌ని ఈసీ లేఖ‌లో పెర్కొంది.

ఇటీవ‌ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదించిన ఒక నివేదిక‌లో రాష్ట్ర ప్ర‌భుత్వాల ఉచిత హామీల‌ను 'టైమ్ బాంబులు' గా అభివ‌ర్ణించి, ఉచిత‌ల‌ ఖ‌ర్చుల‌ను సుప్రీం కోర్టు ప్యానెల్ ద్వారా నియంత్రించాల‌న్సిందిగా సూచించింది.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం లేఖ‌పై రాజ‌కీయ పార్టీలు ఎలా స్పందిస్తాయో అంద‌రికి అస‌క్తిగా ఉంది. అధాయం లేకుండా అప్పులు చేస్తూ ఉచిత‌లు ఇవ్వ‌డం ఎవ‌రికి మంచిది కాదంటూన్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?