లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత లోక్సభ చరిత్రలోనే తొలిసారిగా స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. స్పీకర్ విషయంలో అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇరు పార్టీలు తమ అభ్యర్ధులతో నామినేషన్ దాఖలు చేయించారు.
అధికార పక్ష ఎన్డీఏ కూటమి నుండి బీజేపీ ఎంపీ ఓం బిర్లా.. విపక్ష ఇండియా కూటమి నుండి కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ కె. సురేశ్ స్పీకర్ పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు. దీంతో రేపు ఉదయం 11గంటలకు స్పీకర్ ఎన్నికల జరగనుంది.
స్పీకర్ పదవికి విపక్షాలు మద్దతు ఇచ్చేందుకు ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇండియా కూటమి స్పీకర్ పదవికి పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్పీకర్ పదవికి ఎన్నికలు జరగడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో స్పీకర్ ఎన్నిక విషయంలో అసక్తి నెలకొంది.