భారత మాజీ క్రికెటర్ మృతి!

భార‌త్ జ‌ట్టు మాజీ ఓపెన‌ర్, వాంఖ‌డే స్టేడియం క్యూరేట‌ర్ సుధీర్ నాయ‌క్ మృతి చెందారు. గ‌త నెల‌లో బాత్ రూంలో జారిప‌డ‌టంతో ఆయ‌న త‌ల‌కు గాయ‌మైంది. అప్ప‌ట్నుంచి కోమాలోనే ఉన్న ఆయ‌న నిన్న రాత్రి తుదిశ్వాస…

భార‌త్ జ‌ట్టు మాజీ ఓపెన‌ర్, వాంఖ‌డే స్టేడియం క్యూరేట‌ర్ సుధీర్ నాయ‌క్ మృతి చెందారు. గ‌త నెల‌లో బాత్ రూంలో జారిప‌డ‌టంతో ఆయ‌న త‌ల‌కు గాయ‌మైంది. అప్ప‌ట్నుంచి కోమాలోనే ఉన్న ఆయ‌న నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. 

భారత క్రికెట్ జట్టు తరఫున 1974లో బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో అరంగేట్రం చేసిన ఆయ‌న‌ 3 టెస్టులు, 2 వన్డేలలో ఆడారు. చాలా సంవత్సరాల పాటు రంజీ ట్రోఫిలో ముంబాయి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. గ‌వాస్క‌ర్, అజిత్ వాడేక‌ర్, దిలిప్ స‌ర్దేశాయ్, మ‌న్క‌డ్ లాంటి స్టార్స్ అందుబాటులో లేని స‌మ‌యంలో ముంబై జ‌ట్టును 1971 సీజ‌న్ లో రంజీ ఛాంపియన్ గా నిల‌బెట్టారు. 

దేశవాళీ క్రికెట్‌లో ఇతడు కేవలం క్రికెటర్‌గానే కాకుండా కోచ్‌గా, గ్రౌండ్ క్యురేటర్‌గాను మంచి పేరు సంపాదించుకున్నారు. జహీర్ ఖాన్ రాటుదేలినది ఇతని శిక్షణలోనే. 2005 నుంచి వాంఖేడే స్టేడియం గ్రౌండ్ ఇంచార్జిగానూ సేవలందిస్తున్నాడు.