రైలు ఆల‌స్య‌మైతే.. ఉచితంగా భోజ‌నం!

రైళ్లు స‌రైన స‌మ‌యానికి న‌డిస్తే అదో వార్త‌. ఆల‌స్యంగా న‌డ‌ప‌డం త‌మ గురుత‌ర బాధ్య‌త అన్న‌ట్టుగా రైల్వే అధికారులు భావిస్తుంటారు.

రైళ్లు స‌రైన స‌మ‌యానికి న‌డిస్తే అదో వార్త‌. ఆల‌స్యంగా న‌డ‌ప‌డం త‌మ గురుత‌ర బాధ్య‌త అన్న‌ట్టుగా రైల్వే అధికారులు భావిస్తుంటారు. కారణాలేవైనా రైళ్లు ఆల‌స్యంగా న‌డ‌వ‌డం మ‌న దేశంలో స‌ర్వ సాధార‌ణ‌మైంది. గంట‌ల త‌ర‌బ‌డి రైల్వేస్టేష‌న్ల‌లో ప‌డిగాపులు కాచిన అనుభ‌వం ప్ర‌తి రైల్వే ప్ర‌యాణికుడికి వుంటుంది.

ఈ నేప‌థ్యంలో రైల్వేశాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏదైనా రైలు రెండు గంట‌లు, అంత‌కంటే ఎక్కువ స‌మ‌యం ఆల‌స్యంగా న‌డిస్తే ప్ర‌యాణికుల‌కు ఐఆర్‌సీటీసీ ఉచితంగా భోజ‌నం అందించాల‌ని నిర్ణ‌యించ‌డం విశేషం. ప్ర‌స్తుతానికి ఈ ఉచిత భోజ‌న సౌక‌ర్యం కొన్ని రైళ్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేశారు.

రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్‌ప్రెస్‌ వంటి ప్రీమియం రైళ్లలో ఉచిత భోజ‌నం అందుబాటులో ఉంది. టీ, కాఫీ, బిస్కెట్లు, బ్రెడ్, భోజనం ఆర్డర్ చేయొచ్చు. అలాగే రైలు ఎక్క‌డానికి మూడు గంట‌లు లేదా అంత‌కంటే ఎక్కువ స‌మ‌యం ఆల‌స్య‌మైతే టికెట్‌ను ర‌ద్దు చేసుకునే వెస‌లుబాటు క‌ల్పించారు. రైల్వేస్టేష‌న్‌ల‌లో వెయిటింగ్ రూమ్స్‌లో అద‌న‌పు చార్జీలు కూడా వ‌సూలు చేయ‌రు.

3 Replies to “రైలు ఆల‌స్య‌మైతే.. ఉచితంగా భోజ‌నం!”

  1. ఆ train లో ప్రయాణం చేసే వారేనా rly dept కు డబ్బులు pay చేసేది. మిగతా train వారికి కూడ ఈ సదుపాయం కల్పించాలి.

Comments are closed.