రేవ్ పార్టీల్లో, పబ్బుల్లో మాదక ద్రవ్యాలు సేవించిన వ్యక్తులకు వెంటనే డ్రగ్స్ పరీక్షలు ఎందుకు నిర్వహిస్తారు? ఎందుకంటే, తీసుకున్న డ్రగ్స్ బట్టి శరీరంలో అది ఎన్ని రోజులు ఉంటుందనేది మారుతుంది.
ఉదాహరణకు ఓ వ్యక్తి కొకైన్ తీసుకుంటే, అతడి రక్తంలో వాటి ఆనవాళ్లు 2 రోజుల పాటు ఉంటాయి. మూత్రంలో 3-4 రోజుల పాటు వాటి అవశేషాలు కనిపిస్తాయి. హెరాయిన్ తీసుకుంటే దాని ఆనవాళ్లను రక్తంలో 12 గంటల్లోపు, యూరిన్ లో 3-4 రోజుల్లోపు గుర్తించొచ్చు.
ఎల్ఎస్డీ, ఎండీఎంఏ, మార్ఫిన్, క్రిస్టల్ మెత్, కానబిస్.. ఇలా ఏ డ్రగ్ తీసుకున్నా అది శరీరంలోని రక్తంలో గరిష్టంగా 3 రోజులు, మూత్రంలో గరిష్ఠంగా 5 రోజులు మాత్రమే ఉంటుంది. బెంజోడయాజపైన్స్ అనే డ్రగ్ మాత్రమే అత్యథికంగా మనిషి మూత్రంలో 6 వారాల వరకు ఉంటుంది. ఇక హెయిర్ శాంపిల్స్ లో 90 రోజుల వరకు ఏ డ్రగ్స్ ఆనవాళ్లనైనా పరీక్షల ద్వారా కనుగొనవచ్చు.
కాబట్టి ఓ వ్యక్తి మాదకద్రవ్యాలు తీసుకుంటే, 24 గంటల్లోపే అతడి బ్లడ్, యూరిన్, హెయిర్ శాంపిల్స్ తీసుకుంటారు పోలీసులు. డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనే విషయాన్ని కచ్చితంగా నిర్థారించాలంటే ఇదే సరైన పద్ధతి. డ్రగ్స్ తీసుకున్న వ్యక్తికి 90 రోజుల తర్వాత పరీక్షలు నిర్వహిస్తే అతడికి పూర్తిస్థాయిలో నెగెటివ్ వచ్చే అవకాశం ఉంది. అంటే అతడు మాదక ద్రవ్యాలు సేవించనట్టే లెక్క. కాబట్టి డ్రగ్స్ తీసుకున్న 80-90 రోజుల తర్వాత ఎవరైనా ‘ఓపెన్ టెస్టుల’కు రెడీ అంటూ సవాల్ చేయొచ్చు.
Thank you. Very helpful information
😀
Call boy jobs available 8341510897
హేమో తెలియదు
VC available 9380537747