ఒక అమ్మ.. అనేక ఎర్ర తివాచీలు!

కాంగ్రెస్ పార్టీ అంటేనే సోనియా గాంధీ కుటుంబం పట్ల భక్తికి నిలువెత్తు రూపం. ఆ పార్టీలో చిన్న పెద్ద నాయకులు ప్రతి ఒక్కరూ కూడా సోనియా కుటుంబం పట్ల భక్తిని ప్రదర్శించడం లో పునీతం…

కాంగ్రెస్ పార్టీ అంటేనే సోనియా గాంధీ కుటుంబం పట్ల భక్తికి నిలువెత్తు రూపం. ఆ పార్టీలో చిన్న పెద్ద నాయకులు ప్రతి ఒక్కరూ కూడా సోనియా కుటుంబం పట్ల భక్తిని ప్రదర్శించడం లో పునీతం అవుతుంటారు. సోనియా మీదుగానీ మీ కుటుంబ సభ్యుల మీది గాని ఈగ వాలనివ్వకుండా చూసుకుంటూ ఉంటారు.

అలాంటి సోనియా పట్ల తమ అనన్యమైన భక్తిని ప్రదర్శించడానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ శాఖలకు ఒక మహదవకాశం కలిసి వచ్చింది. దేశంలో రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో.. తమ రాష్ట్రం నుంచి పోటీ చేయాలంటే తమ రాష్ట్రం నుంచే పోటీ చేయాలి అంటూ అందరూ పోటీపడుతున్నారు.

రాయబరేలి స్థానం నుంచి ప్రస్తుతం లోక్ స‌భ‌ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాగాంధీ.. ప్రజల ఓట్ల ద్వారా ఎన్నికయ్యే ట్రాక్ నుంచి తప్పుకుని రాజ్యసభలోకి అడుగుపెట్టి సందర్భం దగ్గర పడినట్లుగా ఉంది. ఈ రాజ్యసభ ఎన్నికల్లో బడిలో ఉండి ఎంపీ అవుతారని.. తమ కుటుంబానికి అచ్చి వచ్చిన రాయి బరేలి స్థానం నుంచి వచ్చే లోకసభ ఎన్నికలలో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది.

అయితే కాంగ్రెస్ పార్టీ అమ్మ సోనియా గాంధీ చేయడానికి అనేక రాష్ట్రాలు ఉత్సాహ పడుతున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాన్ని సోనియమ్మకు ఎర్రతివాచీ పరిచి తమ రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నాయి. తమ రాష్ట్రం నుంచి ఒకే ఎంపీకి అవకాశం ఉన్న రాష్ట్రాలు కూడా.. ఆ ఒక్క సీటును సోనియమ్మకు కట్టబెడతాం అంటున్నాయి. తెలంగాణలో అయితే.. ఆమె లోక్ స‌భ‌లో పోటీ చేసినా గెలిపిస్తామని ఆల్రెడీ అనేక ఆఫర్లు ఇచ్చారు. తీర్మానాలు చేశారు. లోక్ సభ అఫర్లకు తోడుగా.. రాజ్యసభకు పంపుతాం అంటూ రెడ్ కార్పెట్ పరుస్తున్నారు.

ఆహ్వానాలు ఎన్ని ఉన్నప్పటికీ.. రాజస్థాన్ నుంచి రాజ్యసభలో అడుగు పెట్టడానికి సోనియాగాంధీగా సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతమంది ఆహ్వానించడం చూస్తుంటే.. కాంగ్రెసులో సోనియమ్మ భక్తి ఇసుమంత అయినా సడలలేదని అనిపిస్తోంది.