Advertisement

Advertisement


Home > Politics - National

ఇంటర్నెట్ లేకపోతే…హమ్మో!

ఇంటర్నెట్ లేకపోతే…హమ్మో!

నెట్ ఒక్క నిమిషం ఆగితే గిలగిల లాడిపోయే రోజులు వచ్చేసాయి. అలాంటిది అసలు ఇంటర్ నెట్ లేకపోతే…ఊహించడం కష్టం. అన్ని వ్యవస్థలు కుప్ప కూలిపోయే పరిస్థితికి చేరుకున్నాం ఇప్పటికే. తైవాన్ నుంచి దానికి సంబంధించిన ద్వీపం మాట్సూకు నెట్ సరఫరా చేసే తీగలు తెగిపోయాయి. నెట్ ఆగిపోయింది. ఇది చైనా నౌకల పనే అన్నది తైవాన్ ఆరోపణ..అదంతా వేరే సంగతి. కానీ అసలు దీని పరిణామం అన్నది కీలకం. వర్తక వాణిజ్యాలు అన్నీ ఆగిపోయాయి.

ఇదే పరిస్థితిని మన దేశంలో ఊహిస్తే అస్సలు అంచనా వేయలేం. ఇండియాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అన్న కశ్చను వేరే సంగతి. రాదు..రాకపోవచ్చు.  కానీ ఎప్పుడైనా, భవిష్యత్ లో ఏ విపరీత పరిణామం వల్లనో అలాంటి పరిస్థితి వస్తే…

చేతిలో రూపాయి వుంచుకోవడం లేదు మనమెవ్వరం.  పైగా ప్రభుత్వం కానీ టాక్స్ విభాగాలు కూడా వుండకూదనే అంటున్నాయి. కార్డ్ లు, ఫోన్ పేలు, డిజిటల్ పేమెంట్లు ఇవన్నీ నెట్ లేకుండా పని చేయగలవా? వాట్సాప్ అనే ఒక్క వ్యవస్థ ఆధారంగా సమస్త సమాచారరంగం విపరీతంగా ఆధారపడిపోయింది. 

వార్తా ప్రపంచం మొత్తం నిట్ట నిలువుగా నిలిచిపోదూ? ఇలా ఒక్కో రంగం గురించి ఆలోచిస్తూపోతే అస్సలు నెట్ ఆగిపోతే ప్రభావితం కాని రంగం అన్నది లేనే లేదు అని అర్థం అవుతుంది.

మనదేశంలో ప్రస్తుతానికి కేవలం వ్యవసాయం ఒక్కటే నెట్ మీద కాస్త తక్కువ ఆధారపడి వుంది. అంటే నెట్ లేకపోతే తిండి వరకు ఫరవాలేదు.  అది కూడా చేతిలో పైసలు వుంటే..లేదంటే ఛలో పల్లెటూరు అనడమే ప్రతి ఒక్కరూ. కానీ అప్పుడు కూడా ట్రైన్ టికెట్..బస్ టికెట్ తీయాలంటే నెట్ కావాలి కదా? సమస్యే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?