
ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2023 పరిశీలన జాబితాలో తమిళనాడు రచయిత పెరుమాళ్ మురుగన్ రాసిన 'పైర్' నవల చోటు దక్కించుకుంది. ఈ జాబితాలో చేరిన తొలి తమిళ రచయితగా మురుగన్ నిలిచారు.
పైర్ నవల.. కులాంతర వివాహం చేసుకున్న ఓ జంట పారిపోవడం, పరువు హత్య ఇతివృత్తం ఆధారంగా కథనం ఉంటుంది. దీన్ని అనిరుద్ధున్ వాసుదేవన్ ఇంగ్లీష్ లోకి అనువదించారు. ఈ నవలపై ఐదేళ్ల కిందట తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. మురుగన్ పై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే 2016లో కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
గతేడాది హిందీ నవలా రచయిత గీతాంజలి శ్రీ బుకర్ ప్రైజ్ ను గెలుచుకుంది. ‘టాంబ్ ఆఫ్ శాండ్’ పేరుతో గీతాంజలి శ్రీ రచించిన నవలను 2022 ఏడాదికి గాను బుకర్ ప్రైజ్ వరించింది. అలాగే భారతీయ భాషల నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి పుస్తకంగా నిలిచిన విషయం తెలిసిందే.
ఆసియా, ఆఫ్రికా, యూరప్, లాటిన్ అమెరికా వంటి దేశాల నుంచి వచ్చిన 13 పుస్తకాల్లో మురుగన్ తమిళ నవల ‘పైర్’ ఒకటి. మే 23న లండన్‌లో జరిగే కార్యక్రమంలో విజేతను ప్రకటిస్తారు. విజేతలకు రూ.50 లక్షల నగదు బహుమతి ఉంటుంది.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా