భారతీయులు మరోసారి తమ రసికత చాటుకున్నారు. క్యాలెంటర్ లో ఎన్ని సంవత్సరాలు మారినా, ప్రతి ఏటా టాప్ వెబ్ సైట్ లిస్ట్ లో ఓ పోర్న్ సైట్ కచ్చితంగా ఉండాల్సిందే. ఈ ఏడాది కూడా టాప్-10 వెబ్ సైట్లలో ఓ పోర్న్ సైట్ కు స్థానం కల్పించారు ఇండియన్స్. ఇంకా చెప్పాలంటే ఒకటి కాదు, 2 సైట్లకు స్థానం దక్కింది.
ఎప్పట్లానే ఈ ఏడాది కూడా గూగుల్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఎక్కువమంది భారతీయులు హిట్ చేసిన సైట్స్ లో దీనిదే అగ్రస్థానం. ఇక రెండో స్థానంలో యూట్యూబ్ నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా చొచ్చుకొని పోవడంతో యూట్యూబ్ హవా ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది.
ఎక్కువ మంది భారతీయులు చూసిన మూడో సైట్ గా ఫేస్ బుక్, నాలుగో సైట్ గా ఆజ్ తక్ నిలిచాయి. ప్రాంతీయ భాషల్లో ఎక్కువగా పాపులర్ అవ్వడం ఆజ్ తక్ కు కలిసొచ్చింది.
ఇక టాప్-10లో అట్టడుగున్న ఉన్న ఇనస్టాగ్రామ్ మెల్లమెల్లగా తన హవా చాటుకుంటోంది. ఈ ఏడాది ఐదో స్థానంలో నిలిచిన ఈ సైట్, కొత్త ఏడాదిలో కనీసం మూడో స్థానానికి ఎగబాకాలనే టార్గెట్ పెట్టుకుంది.
ఇక ఎక్కువమంది ఇండియన్స్ వీక్షించిన సైట్స్ లో ఆరోస్థానంలో శామ్ సంగ్, ఏడో స్థానంలో క్రిక్ బజ్ సైట్లు ఉన్నాయి. 8,9 స్థానాల్లో 2 పోర్న్ సైట్స్ నిలవగా.. పదో స్థానంలో వాట్సాప్ ఉంది.