ఓడిపోయినా.. అమెరికా అధ్య‌క్షురాలిగా క‌మ‌ల‌?

అమెరిక‌న్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమొక్ర‌టిక్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి ఓట‌మి పాలైన క‌మ‌ల హారిస్ కు అధ్య‌క్ష యోగం అయితే ఉందా? ఇంకో నాలుగేళ్ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల నాటి సంగ‌తి కాదు, అప్ప‌టికి…

అమెరిక‌న్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమొక్ర‌టిక్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి ఓట‌మి పాలైన క‌మ‌ల హారిస్ కు అధ్య‌క్ష యోగం అయితే ఉందా? ఇంకో నాలుగేళ్ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల నాటి సంగ‌తి కాదు, అప్ప‌టికి రాజెవ‌రో రౌతెవ‌రో కానీ, ఇప్పుడే ఆమె అధ్య‌క్ష పీఠాన్ని అధిష్టించ‌వ‌చ్చు అనే టాక్ వ‌స్తోంది. ప్ర‌త్యేకించి డెమొక్రాట్ల నుంచినే ఆమెకు అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించాల‌నే డిమాండ్ వ‌స్తోంది. ట్రంప్ ఎన్నిక‌ల్లో గెలిచేశాడు, అత‌డిని కాద‌ని ఆమె చేత అధ్య‌క్షురాలిగా ప్ర‌మాణ స్వీకారం చేయించాల‌ని కాదు కానీ, ట్రంప్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు తీసుకునే లోగా బైడ‌న్ త‌ప్పుకుని క‌మ‌ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌నేది వారి డిమాండ్.

అమెరికా రాజ్యాంగం ప్ర‌కారం నూత‌న అధ్య‌క్షుడు బాధ్య‌త‌లు తీసుకునేందుకు క‌నీసం నాలుగు నెల‌ల స‌మ‌యం ఉంటుంది. అయితే ఇప్ప‌టికైతే అంత స‌మ‌యం మిగ‌ల్లేదు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 20న ట్రంప్ మ‌రోసారి అధ్య‌క్ష బాధ్య‌త‌లు తీసుకుంటాడు. అప్ప‌టి వ‌ర‌కూ బైడెన్ ప‌ద‌విలో కొన‌సాగ‌వ‌చ్చు. అయితే బైడెన్ త‌క్ష‌ణం ప‌ద‌వి నుంచి త‌ప్పుకుని క‌మ‌ల‌కు ప‌గ్గాలు అప్ప‌గించాల‌నేది డెమొక్రాట్ల నుంచినే వ‌స్తున్న డిమాండ్. టీవీ చాన‌ళ్లు, ట్విట‌ర్ వేదిక‌గా వారు ఈ ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేస్తూ ఉన్నారు.

బైడెన్ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసి, క‌నీసం రెండున్న‌ర నెల‌ల స‌మ‌యాన్ని క‌మ‌ల‌కు ఇవ్వొచ్చ‌ని వారు అంటున్నారు. త‌ద్వారా అమెరికాకు తొట్ట‌తొలి మ‌హిళాధ్య‌క్షురాలికి అవ‌కాశం ఇవ్వాల‌నేది వారి వాద‌న‌. అమెరికా 47వ అధ్య‌క్ష స్థానంలో ఒక మ‌హిళ‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని వారు బైడెన్ ను కోరుతున్నారు.

అమెరికాకు మ‌హిళా ప్రెసిడెంట్ ను చూడాల‌ని క‌ల‌లు కంటున్న వారితో స‌హా, క‌మ‌ల మ‌ద్ద‌తుదార్లు ఈ మాట మ‌ట్లాడుతున్నారు. ఓడిపోయినా ఆమెకు క‌నీసం రెండున్న‌ర నెల‌ల స‌మ‌యాన్ని ఇవ్వాల‌ని వారు కోరుతున్నారు! మ‌రి బైడెన్ అందుకు ఓకే చెబుతారా? అనూహ్యంగా క‌మ‌ల అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్ట‌గ‌ల‌రా? అమెరికా అధ్య‌క్ష హోదాలో మ‌హిళ‌ను చూడాల‌ని కోరుకుంటున్న వారి కోరిక రెండు నెల‌ల కోస‌మే అయినా నెర‌వేరుతుందేమో చూడాలి!

10 Replies to “ఓడిపోయినా.. అమెరికా అధ్య‌క్షురాలిగా క‌మ‌ల‌?”

  1. మహిళలకు అధ్యక్ష పదవి అనే ఆకాంక్షను రెండు నెలలకే సరిపెడతారేమో అమెరికన్లు

Comments are closed.