హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హత్య!

కొన్ని నెలలుగా హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య జ‌రుగుతున్న యుద్ధం ముగింపు ద‌శ‌లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. హ‌మాస్ పొలిటిక‌ల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హ‌నియే ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్‌లో హ‌త్య‌కు గురైన‌ట్లు…

కొన్ని నెలలుగా హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య జ‌రుగుతున్న యుద్ధం ముగింపు ద‌శ‌లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. హ‌మాస్ పొలిటిక‌ల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హ‌నియే ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్‌లో హ‌త్య‌కు గురైన‌ట్లు ఇస్లామిక్ రివ‌ల్యూష‌న‌రీ గార్డ్ కార్ప్స్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ఖతార్‌లో నివసిస్తున్న ఇస్మాయిల్‌ హనియే ఇరాన్‌ నూతన అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు టెహ్రాన్‌కు వెళ్లాడు. ఇరాన్‌లోని ఆయ‌న ఉండే నివాసంపై బాంబు దాడి జ‌ర‌గ‌డంతో హ‌నియేతో పాటు ఆయ‌న బాడీగార్డ్ కూడా చ‌నిపోయిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ హత్యకు పాల్పడింది ఎవరనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

పాలస్తీనాలోని హమాస్‌ గ్రూప్‌కు, ఇజ్రాయెల్‌ సైన్యానికి మధ్య గత కొన్ని నెలలుగా యుద్ధం జరుగుతున్న దృష్టా ఇజ్రాయెల్ నిఘా సంస్థ‌నే హ‌నియేను హ‌త్య చేయించింద‌ని హ‌మాస్ సంస్థ అనుమానాలు వ్య‌క్తం చేస్తోంది. హ‌మాన్‌ను అంతం చేస్తామ‌ని ఇటీవ‌లే ఇజ్రాయోల్ ప్ర‌ధాని బెంజామిన్ నెత‌న్యాహు ప్ర‌క‌టించిన నేప‌ధ్యంలో ఈ అనుమానాలకు బ‌లం చేకురుతోంది.

కొన్ని నెల‌లుగా ఇరు దేశాల మ‌ధ్య యుద్దం వ‌ల్ల వేల మంది చ‌నిపోగా.. ల‌క్ష‌ల మంది క్ష‌త‌గాత్రులు అయ్యారు. ముఖ్యంగా హ‌మాస్ ప్రాతినిధ్యం వహించే గాజాలో అంద‌రూ ప్ర‌జ‌లు నిర్వ‌సితులు అయ్యారు. ఇరు దేశాల మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం చేయించేందుకు అమెరికా ప్ర‌య‌త్నిస్తున్న నేప‌ధ్యంలోనే హ‌మాస్ చీఫ్ హ‌త్య కావ‌డం యుద్దంపై మ‌రింత‌గా ప్ర‌భావం చూపే అవ‌కాశం క‌నిపిస్తోంది.

6 Replies to “హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హత్య!”

Comments are closed.