ఆలోచన కాంగ్రెస్ హయాం నాటిది.. ముందడుగు బీజేపీది!

ఎప్పుడైతే బీజేపీ అంటే ఎన్డీయే జమిలి ఎన్నికల నినాదం ఎత్తుకుందో అప్పటి నుంచి కొన్నేళ్లుగా దేశ ప్రజల్లో, రాజకీయ పార్టీల్లో దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. సహజంగానే ఎన్డీయే పార్టీలు జమిలిని సమర్ధిస్తున్నాయి. కాంగ్రెస్…

ఎప్పుడైతే బీజేపీ అంటే ఎన్డీయే జమిలి ఎన్నికల నినాదం ఎత్తుకుందో అప్పటి నుంచి కొన్నేళ్లుగా దేశ ప్రజల్లో, రాజకీయ పార్టీల్లో దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. సహజంగానే ఎన్డీయే పార్టీలు జమిలిని సమర్ధిస్తున్నాయి. కాంగ్రెస్ అండ్ దాని మిత్ర పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.

జమిలి ఎన్నికలు సాధ్యం కావని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కాంగ్రెస్ గట్టిగా వ్యతిరేకిస్తోంది. దాని మిత్ర పక్షాలు కూడా అదే బాటలో ఉన్నాయి. అసలు జమిలి ఎన్నికలు (వన్ నేషన్ -వన్ ఎలక్షన్ ) అనే ఆలోచన బీజేపీ బుర్రలోనే పుట్టిందా? ఏ విదేశం నుంచైనా కాపీ కొట్టిందా? అంటే అలాంటిది ఏమీ లేదు.

అసలు జమిలి ఎన్నికలు అనే ఆలోచన పుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. నిజానికి ఈ ఆలోచన  41 ఏళ్ల కిందటిది. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 1983లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరపాలని అప్పటి ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి చెప్పింది.

1999లో ఎన్నికల చట్ట సంస్కరణలపై లా కమిషన్ నివేదిక తయారైంది. 2018లో జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదిక విడుదల చేశారు. 2019లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. 2023 సెప్టెంబర్ లో మాజీ రాష్ట్రపతి కోవింద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. 2024 మార్చి 14న కమిటీ నివేదిక సమర్పించింది.

తాజాగా జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించింది. కానీ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కాంగ్రెస్, ఇతర పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. బీజేపీ హయాంలోనే జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని ఒక కేంద్ర మంత్రి చెప్పారు. కానీ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలియదు.

జమిలి ఎన్నికల బిల్లు ఆమోదం పొందడం అంత సులభం కాదు. దానికి చాలా ప్రాసెస్ ఉంది. రాజ్యాంగంలోని చాలా ఆర్టికల్స్ సవరణ చేయాలి. ఎన్డీయే ప్రభుత్వానికి రాజ్యసభలో బలం లేదు. కాబట్టి ఆ సభలో ఆమోదం పొందడం అంత ఈజీ కాదు.

బిల్లు ఆమోదం పొందకపోతే ప్రభుత్వం పరువు పోతుంది. ప్రతిపక్షాలు విజయగర్వంతో విర్రవీగుతాయి. ఈ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెడతారనే టాక్ వస్తోంది. మరి ఏమవుతుందో చూడాలి.

4 Replies to “ఆలోచన కాంగ్రెస్ హయాం నాటిది.. ముందడుగు బీజేపీది!”

  1. as per my understanding BJP wants to have this ONOE is for it to dismiss all non-bjp state governments and rule them by making governor as a proxy. This type of elections will give centre to keep increasing petrol rates without worrying about effecting its election prospects(as of now the pending state government elections are acting as a speed breaker to centre to not increase petrol rates as they wish)

  2. ఉన్న అధికారాన్ని వదులుకొని మూడేళ్లకే ఎన్నికలు పెడదాము అంటే కాంగ్రెస్ ఆనందించాలి కదా

Comments are closed.