జో బైడెన్ నివాసంపై దాడికి తెలుగు కుర్రాడి కుట్ర!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హత్యకు కుట్ర పన్నిన కందుల సాయి వర్షిత్ అనే తెలుగు యువకుడ్ని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. మే 22న సాయి వర్షిత్ వైట్ హౌస్ పరిసరాల్లోకి ట్రక్…

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హత్యకు కుట్ర పన్నిన కందుల సాయి వర్షిత్ అనే తెలుగు యువకుడ్ని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. మే 22న సాయి వర్షిత్ వైట్ హౌస్ పరిసరాల్లోకి ట్రక్ తో దూసుకెళ్లి ట్రాఫిక్ బారియర్స్ ను ఢీకొట్టాడు. దీంతో రాష్ డ్రైవింగ్, ఆస్తుల ధ్వంసంతో అతన్ని అరెస్టు చేశారు. ట్రక్ పై నాజీ జెండాను గుర్తించారు. దాదాపు ఆరు నెలలుగా ఈ దాడికి ప్లాన్ చేశానంటూ విచారణలో ఒప్పుకున్నాట్లు తెలుస్తోంది.

కందుల సాయి వర్షిత్ వయస్సు 19 సంవత్సరాలు. మిస్సోరీలోని ఛెస్టర్‌ఫీల్డ్‌లో నివాసం ఉంటున్నారు. గ్రేటర్ సెయింట్ లూయిస్ ప్రాంతంలోని రాక్‌వుడ్ స్కూల్‌లో చదువుకున్నాడు. 2022లో మార్క్వెట్‌ సీనియర్‌ హైస్కూల్‌ నుంచి అతను గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9:40 నిమిషాల సమయంలో ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని నేరుగా వైట్‌హౌస్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు.

కాగా ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆ ట్రక్కులో మారణాయుధాలు గానీ, మందుగుండు సామగ్రి గానీ ఇతర పేలుడు పదార్థాలు లేవని తెలుస్తోంది. సోషల్‌మీడియా అకౌంట్స్‌ ద్వారా సాయివర్షిత్‌ గురించి పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.