అత్యంత విలాసవంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపే రాజు కూడా కాన్సర్ బారిన పడ్డాడు. అవును.. కింగ్ ఛార్లెస్ కు కాన్సర్ సోకింది. ప్రస్తుతం ఆయన ట్రీట్ మెంట్ లో ఉన్నారు. ఈ విషయాన్ని బకింగ్ హామ్ ప్యాలెస్ అధికారికంగా ప్రకటించింది.
తాజా సమాచారం ప్రకారం, కింగ్ ఛార్లెస్ కు ప్రొస్టేట్ కాన్సర్ సోకినట్టు తెలుస్తోంది. తనకు కాన్సర్ సోకిన విషయం తెలిసిన వెంటనే, అన్ని రకాల సమావేశాల్ని వాయిదా వేసుకున్నారు కింగ్. పూర్తిగా ఏకాంతంగా ఉంటూ, ప్రైవేట్ మీటింగ్స్ లో మాత్రమే పాల్గొంటున్నారు.
తల్లి క్వీన్ ఎలిజిబెత్ మరణం తర్వాత 2022 సెప్టెంబర్ లో రాజుగా మారారు 75 ఏళ్ల ఛార్లెస్. అప్పట్నుంచి అన్ని రకాల బాధ్యతల్ని ఆయన స్వీకరించారు. అప్పట్నుంచి బిజీగా గడుపుతున్న ఆయన ఇప్పుడు కాన్సర్ కారణంగా పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు.
అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉందని, కింగ్ పూర్తిస్థాయిలో కోలుకొని, త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని రాజభవనం ప్రకటించింది. కింగ్ మాత్రం చేయి ఊపి ప్రజలకు ధన్యవాదాలు తెలిపి వెళ్లిపోయారు. ఎలాంటి స్పందన తెలియజేయలేదు.
బ్రిటిష్ రాచరికంలో సింహాసనం కోసం అత్యథిక కాలం ఎదురుచూసిన వ్యక్తి ఛార్లెస్. తల్లి మరణం తర్వాత ఆయనకు 73 ఏళ్ల వయసులో సింహాసనం దక్కింది. ఆ టైమ్ లో ఆయన వ్యక్తిగత జీవితంపై బ్రిటిష్ మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. అలా ఎన్నో వివాదాలు, మరెన్నో సంచలనాల మధ్య ప్రిన్స్ ఛార్లెస్ కాస్తా, కింగ్ ఛార్లెస్ గా అవతరించారు. అంతలోనే ఇలా కాన్సర్ బారిన పడ్డారు.