చెన్నయ్ వర్గాల్లో వున్నట్లుండి స్టార్ట్ అయింది ప్రచారం..హీరో విశాల్ ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడుతున్నారని, కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు మీద వైకాపా అభ్యర్దిగా పోటీ చేస్తారని.
ఇవి ఎందుకు పుట్టాయో, కోలీవుడ్ లోనే ఎందుకు స్టార్ట్ అయ్యాయో అన్న దాని మీద చాలా గ్యాసిప్ లు వున్నాయి. ఇవేవీ పట్టించుకోకుండా, వైకాపానే విశాల్ ను బతిమాలుతోంది, రంగంలోకి దింపాలని చూస్తోంది అంటూ ఎల్లో మీడియా బాపతు సంస్థలు అన్నీ వార్తలు వండి వార్చేసాయి.
ఇప్పుడు దీనికి కౌంటర్ వచ్చేసింది. తనకు అలాంటి ఆలోచన లేదని, కుప్పం రాజకీయాలకు తాను చాలా దూరం అని విశాల్ క్లారిటీ ఇచ్చేసాడట. ఈ మేరకు సోషల్ మీడియాలో మళ్లీ పోస్ట్ లు ప్రారంభం అయ్యాయి.
తనకు అస్సలు ఆంధ్ర రాజకీయాల్లోకి అడుగు పెట్టే ఆలోచనే లేదని, ప్రస్తుతం తన సినిమాలు తాను చేసుకుంటున్నా అంటూ క్లారిటీ ఇచ్చాడు విశాల్.
మొత్తం విశాల్ వ్యవహారం మీడియాకు రెండు రోజుల వార్తలుకు పనికొచ్చింది. అంతకన్నా జరిగింది, జరిగేది ఏమీ లేదు.