రాహుల్ గాంధీపై కేసు పెట్టనున్న మ‌రో మోడీ!

ఐపీఎస్ స్కామ్‌తో పాటు పలు కేసుల్లో చిక్కుకుని అరెస్టు నుంచి తప్పించుకుని దేశం విడిచి పారిపోయిన ఐపిఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ లలిత్ మోడీ కాంగ్రెస్ నేత‌ రాహుల్ గాంధీపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం…

ఐపీఎస్ స్కామ్‌తో పాటు పలు కేసుల్లో చిక్కుకుని అరెస్టు నుంచి తప్పించుకుని దేశం విడిచి పారిపోయిన ఐపిఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ లలిత్ మోడీ కాంగ్రెస్ నేత‌ రాహుల్ గాంధీపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.  రాహుల్ గాంధీపై ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని ల‌లిత్ మోదీ హెచ్చారించారు. త‌న‌పై చేసిన ఆర్ధిక ఆరోప‌ణ‌ల‌పై యూకే కోర్టుకు వెళ్ల‌నున్న‌ట్లు తెలిపారు.

రాహుల్ గాంధీ త‌న‌పై అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్నార‌ని.. గత 15 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా అక్రమంగా దోచుకున్నట్లు ఇప్పటివరకు నిరూపణ కాలేదని..  ఏ కేసులోనైనా దోషిగా తేలానా అంటూ ప్ర‌శ్నించారు. త‌పన‌పై తప్పుడు ఆరోపణలకు గానూ రాహుల్‌కు వ్యతిరేకంగా యూకే కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాన‌ని.. ఆరోప‌ణ‌లు నిరూపించేందుకు రాహుల్ ఆధారాల‌తో స‌హా కోర్టుకు రావాల్సి ఉంటుంద‌ని హెచ్చారించారు. ఆ సాక్ష్యాలు లేక రాహుల్ ఖ‌చ్చితంగా ఫూల్ అవుతార‌న్నారు.

ఇప్పటికే దేశంలోని దొంగల పేర్లన్నీ మోడీ ఇంటి పేరుతోనే ఉంటారంటూ రాహుల్ గతంలో చేసిన వ్యాఖ్యలపై చిక్కుల్లో పడిన విషయం తెల్సిందే. దీనిపై గుజరాత్‌కు చెందిన మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ దాఖలు చేసిన పరువురు నష్టం దావా కేసులో రాహుల్‌కు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పునిచ్చింది.

ఇలాంటి సమయంలో ఐపీఎల్‌ మాజీ ఛైర్మన్‌ లలిత్‌ మోడీ.. రాహుల్‌పై మండిపడ్డారు. ఇప్ప‌టికే ఓ మోడీ వ‌ల్ల త‌న ప‌దవిని పొగొట్టుకున్నా రాహుల్.. తాజాగా మ‌రో మోడీ కేసు ఏమౌతుందో చూడాలి.