రావణాసుర మేటర్ ఇది. ఈ సినిమాలో ఓ సీన్ లో రవితేజపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడట సుశాంత్. అది కేవలం యాక్టింగ్ మాత్రం కాదంటున్నాడు. రవితేజ ఇచ్చిన ప్రోత్సాహంతో దాదాపు అరిచినంత పని చేశాడంట. ఈ విషయాన్ని సుశాంత్ స్వయంగా బయటపెట్టాడు.
“రవితేజ నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. మొహమాటం పక్కన పెట్టేయమన్నారు. ఓపెన్ అవ్వమన్నారు, తిట్టాలనిపిస్తే తిట్టేయమన్నారు. కావాలంటే గట్టిగా అరిచేయమన్నారు. అది నాకు బాగా పనికొచ్చింది. మా ఇద్దరి మధ్య వచ్చిన సన్నివేశాల్లో ఓ 2 సీన్లు మాత్రం ఎక్స్ టార్డనరీగా వచ్చాయి.”
ఇలా రవితేజపై ఫైర్ అయిన విషయాన్ని బయటపెట్టాడు సుశాంత్. పక్కనే ఉన్న రవితేజ కూడా ఈ విషయాన్ని అంగీకరించాడు. స్వతహాగా అక్కినేని ఫ్యామిలీ హీరోలు సాఫ్ట్ గా ఉంటారని, అలాంటి వాళ్లతో ఎగ్రెసివ్ సీన్లు చేయించుకోవాలంటే, పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, తను అదే పని చేశానని వెల్లడించాడు.
మల్టీస్టారర్లు చేయడం వల్ల తమకు ఎలాంటి అభద్రతా భావం లేదని ఈ సందర్భంగా ఇద్దరు హీరోలు ప్రకటించారు. చేసే పాత్రకు పూర్తి న్యాయం చేశానా లేదా అనేది మాత్రమే చూస్తానని సుశాంత్ ప్రకటించగా.. అసలు అభద్రతాభావం అనే పదం తన డిక్షనరీలో లేదని రవితేజ ప్రకటించాడు.
ఈ సందర్భంగా తనయుడు మహాధన్ డెబ్యూపై రవితేజ.. తన పెళ్లిపై సుశాంత్ స్పందించారు. ప్రస్తుతం తను ఆనందంగా ఉన్నానని, ఎలాంటి డేటింగ్ లు, బ్రేకప్ లు లేవని.. ఇప్పట్లో పెళ్లి చేసుకోనని సుశాంత్ క్లారిటీ ఇచ్చాడు. ఇక మహాధన్ విషయానికొస్తే.. మహాధన్ కు సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందని, కచ్చితంగా ఏదో ఒక టైమ్ లో సినిమాల్లోకి వస్తాడని రవితేజ క్లారిటీ ఇచ్చాడు.
ఏప్రిల్ 7న థియేటర్లలోకి వస్తోంది రావణాసుర సినిమా. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించారు.